సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అన్నారు. ఒక వేళ తాను కొన్ని నెలల పాటు జైలుకు వెళ్లాల్సి వచ్చినా కూడా పట్టించుకోనని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆయన ఓ ట్వీట్ చేశారు. 

ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నేడు ప్రశ్నిస్తోంది. అయితే సీబీఐ విచారణకు వెళ్లే ముందు ఆయన ఓ ట్వీట్ చేస్తూ.. తాను కొన్ని నెలల పాటు జైలులో ఉండవలసి వచ్చినా పట్టించుకోనని అన్నారు. తాను ఈ రోజు మళ్లీ సీబీఐ అధికారుల దగ్గరికి వెళ్తానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. దేశం కోసం ఉరి శిక్షకు గురైన స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌కు తాను అనుచరుడినని అన్నారు. 

“ఈరోజు మళ్లీ సీబీఐకి వెళితే మొత్తం విచారణకు పూర్తిగా సహకరిస్తా. లక్షలాది మంది పిల్లల ప్రేమ, కోట్లాది మంది దేశప్రజల ఆశీస్సులు మా వెంట ఉన్నాయి. కొన్ని నెలలు జైల్లో ఉండాల్సి వచ్చినా పట్టించుకోవడం లేదు. అతను భగత్ సింగ్ అనుచరుడిని. దేశం కోసం భగత్ సింగ్‌ను ఉరితీశారు. ఇలాంటి తప్పుడు ఆరోపణల వల్ల జైలుకు వెళ్లడం చిన్న విషయం’’ అని సిసోడియా హిందీలో ట్వీట్ చేశారు.

జార్ఖండ్‌లో కాంగ్రెస్‌ నేతను కాల్చిచంపిన దుండగులు.. కీలక ఉప ఎన్నికకు రెండు రోజుల ముందు దారుణం..

ఢిల్లీ కేబినెట్‌లో ఫైనాన్స్ పోర్ట్‌ఫోలియో బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న మనీష్ సిసోడియా గత ఆదివారం సీబీఐ నుంచి సమన్లు అందుకున్నారు. అయితే తాను ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ రూపొందించడంలో బిజీగా ఉన్నానని, కాబట్టి విచారణను వాయిదా వేయాలని ఆయన కోరారు. దీంతో ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు రావాలని సీబీఐ కోరింది. 

అయితే మనీష్ సిసోడియాకు మద్దతు తెలుపుతూ.. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ‘‘లక్షలాది మంది పిల్లలు, వారి తల్లిదండ్రుల ఆశీస్సులు మీ వెంట ఉన్నాయి. దేశం కోసం, సమాజం కోసం జైలుకు వెళ్లడం శాపం కాదు. అది ఒక మహిమ. మీరు త్వరగా జైలు నుంచి తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. పిల్లలు, తల్లిదండ్రులు, మేమందరం మీ కోసం ఎదురు చూస్తున్నాం.’’ అని పేర్కొన్నారు. 

Scroll to load tweet…

ఇదే విషయంపై శనివారం అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఓ సమ్మిట్ లో మాట్లాడారు. మనీశ్ సిసోడియాను సీబీఐ విచారణకు పిలిచిందని, బహుశా ఆయనను ఆదివారం అరెస్టు చేస్తారని తనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందని అన్నారు. ఇది బాధాకరమని అభివర్ణించారు. కొంత కాలం కిందట సిసోడియా నివాసంపై సీబీఐ దాడులు చేసి బ్యాంకు లాకర్లను తనిఖీ చేసిందని, కానీ ఏమీ దొరకలేదని తెలిపారు. బ్యాంకు ఖాతాలను, ఇంటిని, లాకర్లను తనిఖీ చేసిందని, ఆయన ఆఫీసుపై, గ్రామంలోని ఆస్తులపై దాడి చేసిందని కానీ ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. 

ఢిల్లీలో విద్యావ్యవస్థను మెరుగుపరిచినందుకు ఉప ముఖ్యమంత్రిని ప్రశంసించిన కేజ్రీవాల్.. స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల తరువాత ఈ దేశంలోని పేద ప్రజలకు వారి పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశలు కల్పించిన వ్యక్తి అని కొనియాడారు. అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులో ఇరికించి పరువు తీసేందుకు కుట్ర జరుగుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆయనను తప్పుడు కేసులో అరెస్టు చేసి జైల్లో పెడితే దేశం ఎలా పురోగతి సాధిస్తుందని ప్రశ్నించారు.

మోడీ మన్ కీ బాత్: పేరిణి నాట్యం గురించి ప్రస్తావన

ఒక దేశ రాజు ఆ దేశంలో పేదల పిల్లలకు విద్యను అందించే వారిని జైలుకు పంపి, దేశం మొత్తాన్ని ఇద్దరు, నలుగురు స్నేహితులకు అప్పగిస్తే దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని అన్నారు. 1999 డిసెంబర్ 29న తాను ఆదాయపు పన్ను శాఖలో పనిచేస్తున్నప్పుడే సిసోడియాను తొలిసారి కలిశానని కేజ్రీవాల్ చెప్పారు. ఇదిలా ఉండగా మద్యం పాలసీ కేసులో ఈరోజు మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన నివాసం వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు.