ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  మన్ కీ బాత్  98వ ఎపిసోడ్  కార్యక్రమంలో పాల్గొన్నారు.

న్యూఢిల్లీ: సమాజ శక్తితో దేశ శక్తి కూడా పెరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. ఆదివారంనాడు 98వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. గత నెల 29వ తేదీన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మోడీ నిర్వహించిన విషయం తెలిసిందే.

ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ను మోడీ గుర్తు చేసుకున్నారు. సర్ధార్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించిన మూడు పోటీల్లో విజేతల గురించి ప్రధాని ప్రకటించారు. ఈ పోటీల్లో 700 జిల్లాల నుండి ఐదు లక్షల మందికిపైగా పాల్గొన్నారని ప్రధాని గుర్తు చేశారు. 

Scroll to load tweet…

దేశంలో తయారు చేసిన బొమ్మలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న విషయాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించారు. పేరిణి నాట్యం తెలంగాణ రాష్ట్రంలోని కాకతీయుల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. దేశంలో అనే మంచి సంప్రదాయాలున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొన్ని సంప్రదాయాలు కనుమరుయ్యాయన్నారు. వాటిని పునరుద్దరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.చరిత్ర, సంస్కృతిని కాపాడేందుకు కళాకారులను ప్రోత్సహించాలని మోడీ కోరారు. కళలను ప్రదర్శిస్తున్న అందరిని ప్రధాని అభినందించారు. 

విద్యార్ధులను అన్ని రంగాల్లో పోటీ పడేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. చిన్న పిల్లలకు ఆట వస్తువుల పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుందన్నారు. బోధన సమయంలో ఆట బొమ్మలతో పిల్లలకు విద్యాబోధన జరుగుతున్న విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు.

మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పౌరులు అద్భుతమైన వేదికగా చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇంటింటికి డిజిటల్ సేవలను అందించాలన్నారు. ప్రతి ఇంటికి డిజిటల్ సేవలు అందినప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందన్నారు మోడీ.