హైడ్రాక్సీ క్లోరోక్విన్ కరోనాకి మందు కాదు

హైడ్రాక్సీ క్లోరోక్విన్ ని కరోనా కి ముందులాగ కాకుండా కేవలం ఈ వైరస్ సోకకుండా నివారణగా మాత్రమే వాడాలని ఐసీఎంఆర్ లో ప్రధాన పరిశోధకుడు గంగ ఖేద్కర్ అన్నారు

Hydroxychloroquine Not To Be Used As COVID-19 Cure: ICMR

హైడ్రాక్సీ క్లోరోక్విన్- ప్రస్తుతానికి ఈ డ్రగ్ పేరు సామాన్యుడికి కూడా తెలుసు. మామూలుగా మలేరియాను నయం చేయడానికి వాడే ఈ డ్రగ్ ఇప్పుడు కరోనా పై పోరులో వండర్ డ్రగ్ గా అందరూ పిలుస్తున్నారు. 

అయితే ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ ని కరోనా కి ముందులాగ కాకుండా కేవలం ఈ వైరస్ సోకకుండా నివారణగా మాత్రమే వాడాలని ఐసీఎంఆర్ లో ప్రధాన పరిశోధకుడు గంగ ఖేద్కర్ అన్నారు. విదేశాల్లో దీనికి సంబంధించి రెండు ప్రయోగాలు జరిగాయని, వాటిలో సంతృప్తికర ఫలితాలు రానందున మనదేశంలో ఈ డ్రగ్ ను కేవలం నివారణగా మాత్రమే వాడాలని ఆయన సూచించారు. 

ఈ మాత్రను ప్రజలు తీసుకోవాల్సిన వసరం లేదని, భయాందోళనలో దాన్ని కొని స్టాక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఈ మాత్రను కేవలం డాక్టర్లు, హై రిస్క్ లో ఉన్న ప్రజలకు మాత్రమే ఇస్తున్నారని ఆయన అన్నారు. 

డాక్టర్లు కూడా పేషెంట్లకు చాలా జాగ్రత్తగా మాత్రమే ఈ మందును ప్రిస్క్రైబ్ చేయాలని ఆయన అన్నారు. ఇక కరోనా వైరస్ సోకిన వ్యక్తికి మరల తిరిగి కరోనా వస్తుందా రాధా అనే విషయంలో క్లారిటీ లేదని అన్నాడు. 

ఇకపోతే, గడిచిన 24 గంటల్లో భారతదేశంలో 909 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు.

ఆదివారం మీడియాతో మాట్లాడిన 24 గంటల్లో 34 మంది మరణించినట్లు తెలిపారు. మొత్తం కేసుల సంఖ్య 8,356కి చేరగా, మరణాల సంఖ్య 273కి చేరిందని లవ్ అగర్వాల్ వెల్లడించారు.

Also Read:ముంబై తాజ్‌హోటల్‌లో ఆరుగురికి కరోనా: ఉద్యోగుల్లో ఆందోళన

ఇప్పటి వరకు 716 మంది కరోనా నుంచి బయటపడ్డారని, మార్చి 29 నాటికి దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 979 కాగా..ప్రస్తుతం ఆ సంఖ్య వేగంగా దూసుకెళ్తోందని లవ్ అగర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు.

కేసులకు తగ్గట్టుగానే దానిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం  సర్వ సన్నద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. ఏప్రిల్ 9 నాటికి 1,100 పడకల బెడ్లు  అవసరమైతే తాము 85 వేల పడకలు సిద్ధం చేశామని... నేడు 1,671 పడకలు అవసరమైతే 601 ఆసుపత్రుల్లో లక్షా 5 వేల పడకలు సిద్ధం చేశామని లవ్ అగర్వాల్ చెప్పారు.

దేశంలో 151 ప్రభుత్వ, 68 ప్రైవేట్ కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఐసీఎంఆర్‌కు చెందిన డాక్టర్ మనోజ్ ముర్కేకర్ వెల్లడించారు. ఇప్పటి వరకు 1,86,906 మంది శాంపీళ్లను పరీక్షించినట్లు మనోజ్ చెప్పారు.

Also Read:కరోనాను జయించిన ఆర్నెళ్ల చిన్నారి: చప్పట్లు, విజిల్స్‌తో స్వాగతం

గత ఐదురోజులుగా రోజుకు సగటున 15,747 శాంపిళ్లను పరీక్షిస్తుండగా.. అందులో 584 కేసులు పాజిటివ్‌గా తేలుతున్నట్లు వెల్లడించారు. కరోనా కట్టడికి 40 వ్యాక్సిన్లు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయని... అవేవీ తదుపరి దశకు చేరుకోలేదని మనోజ్ పేర్కొన్నారు.

దీంతో ఈ వైరస్‌కు సంబంధించి ప్రస్తుతానికి ఏ వ్యాక్సిన్ అందుబాటులో లేదన్నారు. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రైవేట్ వైద్య కళాశాలలకు అనుమతులు ఇచ్చినట్లు  ముర్కేకర్ పేర్కొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios