కరోనాను జయించిన ఆర్నెళ్ల చిన్నారి: చప్పట్లు, విజిల్స్‌తో స్వాగతం

ఆరు మాసాల చిన్నారి కరోనాను జయించింది. తల్లితో పాటు ఆ చిన్నారి ఆదివారం నాడు మధ్యాహ్నం ఇంటికి వచ్చింది.కాలనీవాసులు చప్పట్లతో ఆ చిన్నారికి స్వాగతం పలికారు.

Maharashtra: Housing society members welcome 6-month-old Covid-19 survivor with claps, whistles


ముంబై: ఆరు మాసాల చిన్నారి కరోనాను జయించింది. తల్లితో పాటు ఆ చిన్నారి ఆదివారం నాడు మధ్యాహ్నం ఇంటికి వచ్చింది.కాలనీవాసులు చప్పట్లతో ఆ చిన్నారికి స్వాగతం పలికారు.

మహారాష్ట్రలోని కళ్యాణ్‌లోని ఒక హౌసింగ్ సొసైటీ నివాసంలో ఉండే ఒకే కుటుంబంలోని నలుగురు సభ్యులు ఉన్నారు. ముంబైలోని కస్తూర్భా ఆసుపత్రి వైద్యులు ఈ కుటుంబం నుండి ముగ్గురు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వారిని చికిత్స కోసం ఐసోలేషన్ వార్డుకు తరలించారు.

ఈ చిన్నారి తల్లి, చిన్నారికి కరోనా పరీక్షల కోసం ఆసుపత్రిలో ఉంచారు. అయితే ఈ చిన్నారితో పాటు ఆమె తల్లికి కరోనా వైరస్ సోకలేదని వైద్యులు ఆదివారం నాడు నిర్ధారించారు.

అయితే ఇదే హౌసింగ్ సోసైటీకి చెందిన కొందరు ఈ కుటుంబానికి స్నేహితుడిని వేధించినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఆరు మాసాల చిన్నారి తోబుట్టువుకు ఆశ్రయం కల్పించినందుకు  ఆ కుటుంబాన్ని వేధించినట్టుగా మీడియా రిపోర్టు చేసింది.

ఈ ఆరేళ్ల బాలుడిని ఇక్కడ ఉంచడం వల్ల ఈ భవనంలోని ఇతరులకు కూడ ఈ వైరస్ సోకే ప్రమాదం లేకపోలేదని ఈ బాలుడికి ఆశ్రయం కల్పించిన వారిని ప్రశ్నించారు. 

Also read:కరోనా నుండి కోలుకొని అదే ఆసుపత్రి వద్ద వలంటీర్లు

ఈ విషయమై మీడియాలో రిపోర్టు రావడంతో  పోలీసులు ఈ హౌసింగ్ సోసైటీని సందర్శించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.  ఆదివారం నాడు మధ్యాహ్నం ఆరు గంటలకు ఆసుపత్రి నుండి ఆరు నెలల చిన్నారితో పాటు ఆమె తల్లి కస్తూర్బా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.

ఈ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన ఇంటికి వచ్చిన ఆరు మాసాల చిన్నారి ఆమె తల్లిని ఈ హౌసింగ్ సోసైటీ సభ్యులు  చప్పట్లు కొట్టి, విజిల్స్ వేస్తూ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios