హైదరాబాద్: గతంలో రోహిత్ వేముల ఆత్మహత్య సంఘటనతో తీవ్ర అభాసుపాలైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ... ఇప్పుడు మరోసారి విద్యార్థులు నుంచి తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటుంది. 

తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ పరిధిలో "షహీన్ బాగ్" నైట్ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ముగ్గురు విద్యార్థులకు థలా 5000 రూపాయల జరిమానా విధించింది. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా విద్యార్ధి లోకం అవాక్కయింది. ఈ నిర్ణయన్ని వెనక్కి తీసుకోవాలంటూ విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

Also read; షహీన్‌బాగ్ అల్లర్లు: నిరసనకారులతో సుప్రీం మధ్యవర్తి భేటీ

షహీన్ బాగ్ తరహాలో జనుఅరీ 31 నుంచి ఫిబ్రవరి 2 వ తేదీవరకు క్యాంపస్ లో పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్పిఆర్, ఎన్నార్సి లకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనలకు గాను ముగ్గురు విద్యార్థులకు జరిమానా విధించింది. అధీశ్, ఫసి అహ్మద్, సహన ప్రదీప్ అనే ముగ్గురు విద్యార్థులకు ఈ జరిమానాను చెల్లించాలని ఫిబ్రవరి 18వ తేదీన నోటీసులు జారీ చేసింది. 

నోటీసులందుకున్న పది రోజుల్లోపు ఈ సొమ్మును గురు బక్ష్ సింగ్ స్టూడెంట్స్ అసిస్టెన్స్ ఫండ్ లో జమచేయాలని ఆదేశించింది. ఈ నోటీసును జారీ చేసేకంటే ముందు రిజిస్ట్రార్ ఒక కఠినమైన వార్నింగ్ ని కూడా విద్యార్థులకు విడుదల చేసారు. ఇలాంటి కార్యక్రమాలకన్నా తొలుత తమ చదువులపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. 

పర్మిషన్ ఇవ్వకున్నా విద్యార్థులు ఈ నిరసన కార్యక్రమాలను ఏర్పాటు చేసారని, దానితోపాటుగా రాత్రి 11 దాటినా తరువాత ఈ నిరసన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం యూనివర్సిటీ రూల్స్ కు వ్యతిరేకమని యూనివర్సిటీ అధికారులు అభిప్రాయపడ్డారు. అందుకే విద్యార్థులకు ఈ జరిమానా వేసినట్టు వారు తెలిపారు. 

Also read; సీఏఏ ఎఫెక్ట్.. కస్టమర్ ని పోలీసులకు అప్పగించిన ఉబర్ డ్రైవర్

ఈ జరిమానా విషయం తెలియడంతో యూనివర్సిటీ విద్యార్ధి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు దిగాయి. విద్యార్థులను ఇలా ఇబ్బందులకు గురిచేయడానికే ఈ ఫైన్లు వేస్తున్నారని వారు మండిపడ్డారు. ఇలా ఫైన్లు వేసినంత మాత్రాన నిరసనను, వ్యతిరేకతను, అసమ్మతిని అణిచివేయలేరని వారు హెచ్చరించారు.