ఉత్తరప్రదేశ్ లో ఓ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రభుత్వ పథకం డబ్బులు పడగానే భర్తల్ని వదిలేసి.. ప్రియుళ్లతో పరారయ్యారు.
ఉత్తర ప్రదేశ్ : ఆ మహిళలు భర్తలకు భలే ట్విస్ట్ ఇచ్చారు. వారు ఇచ్చిన షాక్ నుండి తేరుకున్న తరువాత భర్తలు లబో దిబో మంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్ లోని భారాబాంకి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం పథకం నిధులు మొదటి విడత తమ ఖాతాల్లో పడగానే ఐదుగురు మహిళలు తమ ప్రియులతో కలిసి ఆ డబ్బులు తీసుకుని పరారయ్యారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద భూమి ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం మూడు లక్షల రూపాయలు నగదు అందజేస్తుంది. దీనికోసం భారాబంకీ జిల్లా నుంచి 40 మంది మహిళలను అధికారులు ఇటీవల లబ్ధిదారులుగా ఎంపిక చేశారు.
ఈ క్రమంలోనే మొదటి వాయిదా కింద 50 వేల రూపాయల చొప్పున కొందరు మహిళల అకౌంట్లో పడ్డాయి. ఇందులో ఐదుగురు మహిళలు తమ అకౌంట్లో డబ్బులు పడగానే తమ ప్రియులతో కలిసి భర్తలను వదిలేసి పారిపోయారు. ఆ విషయం తెలిసిన భర్తలు షాక్ అయ్యారు. తమకు సహాయం చేయకపోయినా పరవాలేదు.. కానీ రెండో విడత డబ్బులు తమ భార్యల ఖాతాల్లో మాత్రం వేయొద్దని చెప్తున్నారు. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానికంగా ఇది చర్చనీయాంశంగా మారింది.
13 ఏళ్ల బాలికను దారుణంగా టార్చర్ పెట్టిన గురుగ్రామ్ దంపతులు.. భౌతిక దాడులతో ఒళ్లు హూనం
ఉత్తర ప్రదేశ్ లోని బెల్హారానగర్ పంచాయతీ, ఫతేపూర్, బంకి, జైద్ పూర్, సత్రిక్ పంచాయతీల నుంచి ఇళ్ల నిర్మాణ పనులు ఇంకా మొదలుపెట్టలేదంటూ కొన్ని రోజుల క్రితం విడివిడిగా ఫిర్యాదులు వచ్చాయి. ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మొదటి విడత డబ్బులు వారి ఖాతాల్లో పడ్డ తర్వాత ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాలంటూ లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చాం. అయితే ఆ ఐదుగురు లబ్ధిదారులు తమ భార్యల ఖాతాలో పడ్డ డబ్బులతో వారు పరారయ్యారని.. మిగతా రెండు వాయిదాల డబ్బులను వాళ్ల ఖాతాల్లో వేయవద్దంటూ తమ దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేశారని’ డియుడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ సౌరబ్దిపాటి మీడియాకు తెలిపారు. దీంతో బాధితుల ఫిర్యాదును విచారిస్తున్నామని ఈ మేరకు దర్యాప్తు చేపట్టి నిజానిజాలు వెలికి తీస్తామన్నారు.
