Asianet News TeluguAsianet News Telugu

13 ఏళ్ల బాలికను దారుణంగా టార్చర్ పెట్టిన గురుగ్రామ్ దంపతులు.. భౌతిక దాడులతో ఒళ్లు హూనం

గురుగ్రామ్‌లో ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్న 13 ఏళ్ల బాలికపై ఆ దంపతులు దారుణంగా టార్చర్ పెట్టారు. ఇనుప వస్తువులు, కర్రలను వేడి చేసి చేతులు, ముఖం, ఇతర శరీర భాగాలపై గాయపరిచారు. భౌతికంగా హింసించారు. ఆమె ఫొటోలను ఓ యాక్టివిస్ట్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. పోలీసులు యాక్షన్ తీసుకున్నారు.
 

domestic help minor girl tortured brutally by gurugram couple
Author
First Published Feb 8, 2023, 1:15 PM IST

న్యూఢిల్లీ: గురుగ్రామ్‌లో ఓ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. ఇంటిలో పని మనిషిగా పెట్టుకున్న ఓ 13 ఏళ్ల బాలికను దంపతులు దారుణంగా టార్చర్ పెట్టారు. గత కొన్ని నెలలుగా ఆ మైనర్ బాలికపై భౌతిక దాడికి పాల్పడ్డారు. వేడి ఇనుప వస్తువులు, కర్రలతో కాల్చారు. ఒంటినిండా దెబ్బల గాయాలు, గాట్లే ఉన్నాయి. దాడులతో ఒళ్లు హూనం చేశారు. ఒంటి పై గాయం లేని చోటు లేదు. జార్ఖండ్‌కు చెందిన ఆ బాలిక ప్రస్తుతం ఓ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ పొందుతున్నది. ఆమె పై లైంగిక దాడి జరిగిందా? లేదా? అనేది తెలుసుకోవడానికీ పరీక్షలు జరుగుతున్నాయి. పోలీసులు దంపతులపై కేసు పెట్టారు. వారిని అరెస్టు చేశారు.

ఆ బాలికకు భోజనం పెట్టకుండా ఆకలి మంటలకు వదిలిపెట్టారని, సరిగా పని చేయడం లేదని, ఆహారం దొంగిలిస్తున్నదని ఆమెను తరుచూ కొట్టేవారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కొన్ని రోజులుగా ఆమెకు ఆహారం పెట్ట లేదని ఓ అధికారి తెలిపారు. డస్ట్ బిన్‌ లో పడేసిన ఆహారాన్ని ఆమె తినేదని పేర్కొన్నారు.

గురుగ్రామ్‌కు చెందిన ఓ ఎన్జీవో ఫిర్యాదుతో పోలీసులు ఆ బాలికను రక్షించారు. ఆ బాలిక గురించి ఓ యాక్టివిస్ట్ చేసిన ట్వీట్ నిన్న వైరల్ అయింది. ఆ ట్విట్టర్ త్రెడ్ వైరల్ అయిన తర్వాత పోలీసులను ఎన్జీవో కాంటాక్ట్ అయింది. ఆ బాలిక ఫొటోలను యాక్టివిస్ట్ దీపికా నారాయణ్ భరద్వాజ్ షేర్ చేశారు. అందులో ఆ బాలిక ఒంటి నిండా గాయాలు, కాలిన గాయాలున్నాయి. ఆమె నుదుటిపై, పెదవులు, గదవ, చేతులపై గాయాలు ఉన్నాయి.

Also Read: శ్రద్ధా వాకర్ ఎముకలను దంచి పౌడర్ చేశాడు.. చివరిగా మూడు నెలల తర్వాత తలను పడేశాడు: ఢిల్లీ పోలీసులు

కొన్ని నెలల క్రితం ఓ ప్లేస్‌మెంట్ ఏజెన్సీ ద్వారా ఆమెను ఆ దంపతులు హైర్ చేసుకున్నారు. వారి మూడు నెలల పాపను చూసుకోవడానికి ఆమెను పనిలో పెట్టుకున్నట్టు తెలిసింది. 

ఆ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్, పోక్సో యాక్ట్ సహా మరికొన్ని ఆరోపణల కింద దంపతులపై కేసు నమోదైంది. 

ఆ బాలిక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత స్ట్రాంగ్ రియాక్షన్స్ వచ్చాయి. అనంతరం, నిందితుల్లో ఒకరైన ఆ మహిళను, ఆమె పని చేసే సంస్థ ఉద్యోగంలో నుంచి తొలగించినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి.

Follow Us:
Download App:
  • android
  • ios