Asianet News TeluguAsianet News Telugu

భార్యను చంపి, చేతులు, తల నరికి... శరీరానికి నిప్పంటించిన భర్త..

హర్యానాలోని మనేసర్‌లో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి.. ఆమె తల, చేతులు నరికి.. మృతదేహానికి నిప్పంటించాడు. 

husband who killed his wife, cut off her hands and head and set body on fire in haryana - bsb
Author
First Published Apr 28, 2023, 3:23 PM IST

హర్యానా : హర్యానాలోని మనేసర్ జిల్లాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తిని తన భార్యను అతి దారుణంగా హత్య చేసినందుకుగానూ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అతను మొదట భార్య చేతులు నరికి, ఆపై ఆమె తల నరికి, మృతదేహానికి నిప్పంటించాడు. తన భార్యను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. 

ఏప్రిల్ 21న మనేసర్‌లోని ఒక గ్రామంలో సగం కాలిపోయిన మహిళ మృతదేహం దొరికింది. అయితే,  ఆమెను వేరే చోట హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ తల లేదు. చేతులు నరికేసి ఉన్నాయి.

ఏప్రిల్ 23న పోలీసులు ఆ మహిళ నరికిన చేతులను గుర్తించారు. దీంతో హత్యకు సంబంధించిన మరిన్ని  వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ మహిళ నరికిన తలను ఏప్రిల్ 26న కనిపెట్టారు. ఆ మహిళను ఖేర్కీ దౌలా ప్రాంతానికి చెందినదిగా గుర్తించారు. పోలీసులు విచారణలో ఆ మొండెం 30 ఏళ్ల మహిళదని నిర్ధారించారు. అయితే హత్య వెనుక కారణం ఇంకా తెలియరాలేదు.

నా కూతురు తన భర్తను ప్రధాని చేసింది: సుధా మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు (వీడియో)

నిందితుడు జితేందర్‌ను విచారిస్తున్నామని, శుక్రవారం మరిన్ని వివరాలు తెలియజేస్తామని గురుగ్రామ్ పోలీస్ కమిషనర్ కళా రామచంద్రన్ తెలిపారు. జితేందర్ గాంధీ నగర్ నివాసి, మనేసర్ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటున్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కుక్డోలా గ్రామ నివాసి ఉమేద్ సింగ్ కౌలుకు తీసుకున్న పొలంలో ఉన్న రెండు గదులలో ఒకదానిలో మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. 

దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంచగావ్ చౌక్ నుంచి కసన్ గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కన ఉమేద్ సింగ్ ఎనిమిది ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నాడు. ఆ వ్యవసాయ భూమిలో ఉన్న రెండు గదుల్లో ఓ గదిలో.. సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన ఉమేద్ సింగ్ పోలీసులకు సమాచారం అందించాడు.

దీని గురించి అతను మాట్లాడుతూ.. "మా పొరుగింటివారు నాకు ఫోన్ చేసి, నా పొలంలోని ఒక గదిలో నుండి పొగలు వస్తున్నాయని చెప్పారు. వెంటనే, నేను పొలానికి వెళ్ళినప్పుడు, గదిలో సగం కాలిపోయిన మృతదేహం మొండెం కనిపించింది. వెంటనే, నేను పోలీసులకు సమాచారం అందించాను" అని ఉమేద్ సింగ్ తన ఫిర్యాదులో పోలీసులకు చెప్పారు. 

ఉమేద్ సింగ్ ఫిర్యాదుపై, మనేసర్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్లు 302 (హత్య), 201 (సాక్ష్యాలను దాచడం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios