నా కూతురు తన భర్తను ప్రధాని చేసింది: సుధా మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు (వీడియో)

బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ అత్త సుధా మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నా కూతురు అక్షతా మూర్తి తన భర్తను బ్రిటన్ ప్రధాన మంత్రిని చేసింది’’ అని సుధా మూర్తి అన్నారు.

My daughter made her husband Prime Minister says Rishi Sunak Mother In Law Sudha Murty ksm

బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ అత్త సుధా మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నా కూతురు అక్షతా మూర్తి తన భర్తను బ్రిటన్ ప్రధాన మంత్రిని చేసింది’’ అని సుధా మూర్తి అన్నారు. రిషి సునక్ తక్కువ వ్యవధిలో అధికారాన్ని దక్కించుకోవడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.  అయితే ఇది తన కూతురు వల్లే సాధ్యమైందని సుధా మూర్తి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో సుధా మూర్తి మాట్లాడుతూ.. ‘‘నేను నా భర్తను వ్యాపారవేత్తను చేసాను. నా కుమార్తె ఆమె భర్తను ప్రధాన మంత్రిని చేసింది’’ అని చెప్పారు. 

దీనికి కారణం భార్య మహిమే అని సుధా మూర్తి అన్నారు. ‘‘భార్య తన భర్తను ఎలా మారుస్తుందో చూడండడి. కానీ నేను నా భర్తను మార్చలేకపోయాను. నేను నా భర్తను వ్యాపారవేత్తను చేశాను. నా కుమార్తె తన భర్తను ప్రధానిని చేసింది’’ అని సుధా మూర్తి పేర్కొన్నారు. 

అక్షతా మూర్తి ఆమె భర్త రిషి సునక్‌ను పలు విధాలుగా ప్రభావితం చేసినట్టు సుధామూర్తి చెప్పారు. అక్షత కారణంగా రిషి ఆహార నియమాలు మారాయని తెలిపారు. తమ కుటుంబం ప్రతి గురువారం ఉపవాసం ఉండే సంప్రదాయాన్ని చాలా కాలంగా అనుసరిస్తుందని సుధామూర్తి చెప్పారు. గురువారం రోజే ఇన్ఫోసిస్ కంపెనీ కూడా ప్రారంభమైందని గుర్తుచేశారు. తన అల్లుడు రిషి సునాక్ పూర్వీకులు 150 ఏండ్లుగా ఇంగ్లండ్‌లోనే ఉంటున్నారని తెలిపారు. అయినప్పటికీ వారంతా చాలా దైవభక్తి కలిగిన వారని తెలిపారు. తన అల్లుడు రిషి తల్లి ప్రతి సోమవారం ఉపవాసం ఉంటారని..  అయితే రిషి మాత్రం ప్రతి గురువారం ఉపవాసం ఉంటున్నారని చెప్పారు. 

 


ఇక, సుధా మూర్తి భర్త.. నారాయణ మూర్తి భారతదేశపు అత్యంత సంపన్నులలో ఒకరనే సంగతి తెలిసిందే. నారాయణ మూర్తి ఇన్ఫోసిస్ టెక్ కంపెనీ స్థాపకుడు. వీరి కుమార్తె అక్షతా మూర్తి, రిషి సునాక్‌లు 2009లో ప్రేమించి వివాహం చేసుకున్నారు. అతి పిన్న వయసులోనే రిషి సునక్ బ్రిటన్ ప్రధాన మంత్రిగా ఆయన ఎదిగారు. కేవలం ఏడు సంవత్సరాలలో ప్రధానమంత్రి అయిన ఎంపీగా కూడా నిలిచారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios