కోర్టు ఆవరణలోనే భార్య ముఖంపై యాసిడ్ పోసిన భర్త.. తమిళనాడులో ఘటన
ఇద్దరు భార్యాభర్తలు ఓ కేసు విచారణ కోసం కోర్టు కాంప్లెక్స్ లోకి అడుగుపెట్టారు. విచారణ జరుగుతున్న సమయంలో ఇద్దరూ పక్కనే కూర్చున్నారు. కానీ ఒక్క సారిగా భర్త తనతో పాటు వాటర్ బాటిల్ లో తెచ్చుకున్న యాసిడ్ ను భార్య ముఖంపై పోశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటు చేసుకుంది.

తమిళనాడులో దారుణం జరిగింది. ఓ వ్యక్తి కోర్టు ఆవరణలోనే తన భార్య ముఖంపై యాసిడ్ పోశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో భార్యతో పాటు ఆమె పక్కనే ఉన్న మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరందరినీ స్థానికులు హాస్పిటల్ కు తరలించారు.
‘సత్యమే నా దేవుడు..’- పరువు నష్టం కేసులో దోషిగా తేలిన తర్వాత రాహుల్ గాంధీ మొదటి ట్వీట్
వివరాలు ఇలా ఉన్నాయి. కోయంబత్తూరులో ఉన్న కోర్టుకు ఓ వివాదం పరిష్కారం కోసం కవిత, శివకుమార్ అనే ఇద్దరు భార్యాభర్తలు గురువారం వచ్చారు. వివిధ కేసుల నిమిత్తం జిల్లాలోని ప్రజలు, న్యాయవ్యాధులు, పోలీసులు, ఇతర సిబ్బందితో కోర్టు ప్రాగణం అంతా బిజీ బిజీగా ఉంది. కుటుంబ కలహాల కారణంగా కవిత కేసు పెట్టగా, కోర్టులో కేసు విచారణకు వచ్చింది. కోర్టు ఆవరణలో భార్య పక్కనే కూర్చున్న భర్త తన వెంట తెచ్చుకున్న యాసిడ్ బాటిల్ తో కవిత ముఖంపై దాడి చేశాడు. అనుకోకుండా ఈ జరిగిన ఈ పరిణామంతో కోర్టు ప్రాంగణం అంతా ఒక్క సారిగా ఉలిక్కిపడింది.
ఈ ఘటన కవిత తీవ్రంగా గాయపడింది. ఈ సమయంలో ఆమె పక్కనే ఉన్న మరో ఐదుగురికి కూడా గాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రులందరినీ చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. తరువాత శివకుమార్ తప్పించుకొని పారిపోవాలని ప్రయత్నించాడు. దీంతో అక్కడే ఉన్న న్యాయవాదులు, స్థానికులు శివకుమార్ ను పట్టుకుని చితకబాదారు. తరువాత పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కవితను డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) చందీష్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. యాసిడ్ దాడిలో ఆమె శరీరం 80 శాతం దెబ్బతిన్నదని అన్నారు. ‘‘అతడు (శివకుమార్) వాటర్ బాటిల్‌లో యాసిడ్ తీసుకొచ్చాడు. కానీ అతడిపై ఎవరికీ అనుమానం కలగలేదు. దంపతుల మధ్య వివాదం కారణంగానే ఈ సంఘటన జరిగింది’’ అని డీసీపీ చెప్పారు. ఈ ఘటన తరువాత కోర్టు కాంప్లెక్స్‌లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఆయన తెలిపారు.