Asianet News TeluguAsianet News Telugu

‘సత్యమే నా దేవుడు..’- పరువు నష్టం కేసులో దోషిగా తేలిన తర్వాత రాహుల్ గాంధీ మొదటి ట్వీట్

2019 నాటి పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన తరువాత ఆయన మొదటి సారిగా స్పందించారు. మహత్మా గాంధీ కొటేషన్ ను ఆయన ప్రస్తావిస్తూ ట్విట్టర్ లో ఓ పోస్టు చేశారు. 

Truth is my God..- Rahul Gandhi's first tweet after being found guilty in a defamation case - ISR
Author
First Published Mar 23, 2023, 1:24 PM IST

2019 నాటి పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధినాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషి తేల్చింది. ఈ శిక్షకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చిన తరువాత ఆయన మొదటి సారిగా స్పందించారు. మహాత్మాగాంధీ చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ ఆయన ఓ ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు. అందులో ‘‘నా మతం సత్యం, అహింసపై ఆధారపడింది. సత్యమే నా దేవుడు, అహింస దానిని పొందే సాధనం.- మహాత్మాగాంధీ’’ అంటూ ట్వీట్ చేశారు.

సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన కేసు 2019 సంవత్సరానికి సంబంధించినది. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో కర్ణాటకలో నిర్వహించిన ఓ సభలో దొంగలందరికీ  మోడీ అనే ఇంటి పేరు  ఎలా ఉందని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.  ఈ వ్యాఖ్యలపై  కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం  సాగింది. రాహుల్ గాంధీ  నరేంద్ర మోడీపై  చేసిన వ్యాఖ్యల పై  గుజరాత్ మాజీ మంత్రి , బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ  ఈ విషయమై  పోలీసులకు  ఫిర్యాదు  చేశాడు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇక అప్పటి నుంచి ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది. తాజాగా ఈ కేసుపై తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన కోర్టు..2 సంవత్సరాల శిక్షను ఖరారు చేసింది.  పై కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి వీలుగా శిక్షను ఒక నెల పాటు సస్పెండ్ చేసింది. అయితే కేసుపై రాహుల్ గాంధీ తరఫు న్యాయవాదులు బెయిల్  పిటిషన్ దాఖలు  చేశారు. ఈ పిటిషన్ ను కోర్టు ఆమోదించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios