భార్య గర్భంలోని శిశువు మృతి చెందడంతో మనోవేదన తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. 

తమిళనాడు : ఓ వ్యక్తి.. భార్య గర్భంలో ఆరు నెలల శిశువు చనిపోవడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. చెన్నైలోని స్థానిక వ్యాసార్పాడి ముల్లైనగర్ లో ఈ ఘటన వెలుగు చూసింది. వెళ్లై ప్రకాష్(27), పవిత్ర దంపతులు ముల్లెనగర్ లోని 82వ బ్లాక్ ప్రాంతంలో ఉంటారు. వీరికి ఇదివరకే ఓ రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.

ఆరు నెలల క్రితం పవిత్ర మళ్లీ గర్భం దాల్చింది. ప్రకాష్ కి పిల్లలంటే చాలా ప్రేమ. దీంతో రెండో సంతానం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం పవిత్ర అనారోగ్యానికి గురైంది. చికిత్స నిమిత్తం పవిత్రను ఎగ్మోర్ చిల్డ్రన్స్ హాస్పిటల్ లో చేర్చారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు.. గర్భంలోని శిశువు చనిపోయిందని తెలిపారు.

అతిక్ అహ్మద్ ను అమరవీరుడిగా అభివర్ణించిన ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా.. హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటన

అలాగే ఉంటే ఆమె ప్రాణాలకు ప్రమాదం అని చెప్పి అబార్షన్ చేసి మృత శిశువును తొలగించారు. ఈ విషయం తెలిసిన ప్రకాష్ తట్టుకోలేకపోయాడు. భార్య గర్భంలోని శిశువు మృతి చెందడాన్ని జీర్ణించుకోలేక మనస్థాపానికి గురయ్యాడు. దీంతోనే జీవితం మీద విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రకాష్ ఉరివేసుకుని మరణించాడు. విషయం తెలుసుకున్న ఎంకేబీనగర్ పోలీసులు దీనిమీద కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 

ఇదిలా ఉండగా, భార్య మరణాన్ని తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో విషాదం నింపింది. ఆర్మీ జవాన్ అయిన మంగరాజు రాజబాబు అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయిన భార్య మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం ఈసర్ల పేట గ్రామానికి చెందిన మంగరాజు రాజబాబుకి 2016లో ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత ఆరేళ్ళకి 2022లో ఈసర్లపేట గ్రామానికే చెందిన మౌనికతో వివాహం జరిగింది.

ప్రస్తుతం రాజబాబు హర్యానాలో విధుల్లో ఉన్నాడు. రాజబాబు భార్య మౌనిక ఏడు నెలల గర్భిణీ. ఇటీవల ఆమె అనారోగ్యంతో బాధపడుతుంది. దీంతో రాజబాబు తండ్రి కోడలిని వైజాగ్ ఆర్మీ ఆసుపత్రిలో చేర్పించాడు. ఆమె అనారోగ్యం సంగతి కొడుకుకు సమాచారం ఇచ్చాడు. రాజబాబు సెలవు మీద హర్యానా నుంచి వైజాగ్ కు వచ్చాడు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే ఈనెల 16వ తేదీన మౌనిక మృతి చెందింది.

భార్య ఇలా హఠాత్తుగా మరణించడాన్ని రాజబాబు జీర్ణించుకోలేకపోయాడు. ఆమెనే తలచుకుంటూ భోజనం కూడా చేసేవాడు కాదు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దానికి తోడు మానసిక వేదనతో కృంగిపోయాడు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 19వ తేదీన తన ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రిలో చూపించుకుంటానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. అలా బయటికి వచ్చిన రాజబాబు ఆముదాలవలసకు వెళ్ళాడు. అక్కడ రైలెక్కి పొందూరు చేరుకున్నాడు.

ఆ తర్వాత స్నేహితులకు ఓ మెసేజ్ చేశాడు. తాను పొందూరులో ఉన్నానని.. చనిపోబోతున్నానని అందులో పేర్కొన్నాడు. దీంతో ఫ్రెండ్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే పొందూరు పోలీసులకు సమాచారం అందించారు. స్నేహితుల సమాచారం మేరకు పోలీసులు పొందూరు, ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం వెతికారు. చాలాసేపటి తర్వాత కొంచాడ దగ్గర ఉన్న ఓ తోటలో రాజబాబు ఉరివేసుకుని కనిపించాడు. కోడలు చనిపోయిన నాలుగు రోజులకు కొడుకు బలవన్మరణం పాలవడం.. ఇంట్లో వెంట వెంటనే మరణాలతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.