అతిక్ అహ్మద్ ను అమరవీరుడిగా అభివర్ణించిన ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా.. హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటన

గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ ను అమరవీరుడు అని ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా కీర్తించింది. అతడి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ప్రతీకార దాడులు చేస్తామని పేర్కొంటూ ఈద్ సందర్భంగా విడుదల చేసిన ఓ మ్యాగజైన్ లో పేర్కొంది. 

Al Qaeda, who described Atiq Ahmed as a martyr, announced that they will take revenge for the murder..ISR

మాఫియా డాన్ అతిక్ అహ్మద్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని అల్ ఖైదా టెర్రరిస్టు గ్రూప్‌లోని భారత విభాగమైన అల్ ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్ (ఏక్యూఐఎస్) హెచ్చరించింది. అతిక్ అహ్మద్ ను అమరవీరుడిగా అభివర్ణించింది. ప్రతీకార దాడులు చేస్తామని బెదిరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈద్ సందర్భంగా ఏక్యూఐఎస్ విడుదల చేసిన ఏడు పేజీల మ్యాగజైన్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. 

36 గంటల్లో 5300 కిలో మీటర్లు.. ఏప్రిల్ 24, 25 తేదీల్లో ప్రధాని మోడీ పవర్ ప్యాక్డ్ షెడ్యూల్ ఇదే..

‘‘మేము అణచివేతదారుల చేతికి అండగా ఉంటాము. వైట్ హౌస్ లో అయినా ఢిల్లీలోని ప్రధాని ఇంట్లో అయినా, రావల్పిండిలోని జీహెచ్ క్యూ అయినా, టెక్సాస్ నుండి తీహార్ వరకు అడియాల వరకు ముస్లిం సోదర సోదరీమణులందరినీ వారి సంకెళ్ల నుంచి విముక్తులను చేస్తాం’’అని ఆ మ్యాగజైన్ పేర్కొన్నట్టు ‘న్యూస్ 18’ నివేదించింది. అతిక్ అహ్మద్ హత్యను ‘‘యూపీలో లైవ్ టీవీలో ముస్లింల కోసం చేసిన బలిదానం’’ అంటూ ఏక్యూఐఎస్ పేర్కొంది. 

బీజేపీ ఒక గద్దర్ పార్టీ.. ఎన్ఆర్సీ అమలును అనుమతించబోము - ఈద్ నమాజ్ లో మమతా బెనర్జీ

ఇదిలావుండగా.. హతమైన గ్యాంగ్ స్టర్ కు మద్దతుగా పలువురు నినాదాలు చేసిన ఘటన బీహార్ లో వెలుగులోకి వచ్చింది. ఈ హత్యలను ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కుట్రగా అభివర్ణించారు. రంజాన్ మాసం చివరి రోజున పాట్నా జంక్షన్ సమీపంలోని జామా మసీదు వద్ద ‘‘అల్విదా కా నమాజ్’’ చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ప్రార్థనల అనంతరం కొందరు రోడ్లపైకి వచ్చి షహీద్ అతిక్ అహ్మద్ అమర్ రహే, అష్రఫ్ అహ్మద్ అమర్ రహే, అసద్ అహ్మద్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. కేంద్రానికి, యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. కేవలం రెండు స్థానాల్లోనే ఎంఐఎం పోటీ.. ఎందుకంటే ?

ఏప్రిల్ 15వ తేదీన ప్రయాగ్ రాజ్ లో అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ ను జర్నలిస్టుల వేషంలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. నగరంలోని కొల్విన్ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం పోలీసులు తీసుకెళ్తుండగా అన్నదమ్ములిద్దరిపై దుండగులు కాల్పులు జరిపారు. అతిక్ ను, అతని సోదరుడిని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరిపిన ఆ ముగ్గురు నిందతులు ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. అంతకు ఒక రోజు ముందే ఝాన్సీ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ నుయూపీ ఎస్టీఎఫ్ హతమార్చింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios