పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రావడం లేదని భర్త ఆత్మహత్య.. ఎక్కడంటే ?
పుట్టింటికి వెళ్లిన భార్య ఇంటికి తిరిగి రావడం లేదని ఆ భర్త మనస్థాపం చెందాడు. ఎంత బతిమిలాడిన ఆమె వినకపోవడంతో ఇంట్లో ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వారిద్దరు భార్య భర్తలు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పలు కారణాల వల్ల భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య కోపంతో తన పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లలను కూడా తీసుకెళ్లింది. కొన్ని రోజులు గడిచిన తరువాత భర్త ఆమెకు కాల్ చేశాడు. అలక వీడాలని, తిరిగి తమ ఇంటికి రావాలని కోరాడు. కానీ దానికి ఆమె నిరాకరించింది. అతడు ఎంతగా బతిమిలాడిన భార్య మాటవినిపించుకోలేదు. అయితే భర్త దగ్గర నుంచి తన పుట్టింటికి వెళ్లిన నెల రోజుల తరువాత ఇంటికి తిరిగి వచ్చింది. తలుపులు వేసి ఉన్నాయి. వాటిని తెరిచి చూసి ఒక్క సారిగా షాక్ అయ్యింది. ఇంట్లో భర్త ఆత్మహత్య చేసుకొని కనిపించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
కవల ఆడ పిల్లలకు జన్మనిచ్చిన భార్య.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య
వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ సిటీకి దగ్గరలో ఉన్న అమీనాబాద్ గ్రామంలో సుదామ శర్మ, కీర్తి శర్మ అనే ఇద్దరు దంపతులు నివసిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత నెల 18వ తేదీన ఇద్దరు దంపతులు గొడవపడ్డారు. దీంతో భార్య తన భర్త మీద అలిగింది. కోపంతో తన తల్లిగారింటికి వెళ్లిపోయింది. తన వెంట పిల్లలను కూడా తీసుకెళ్లింది.
తనది'ఫేక్ స్టింగ్' అని బీజేపీ "డర్టీ లైస్" చెబుతోంది.. స్వాతి మలివాల్
మరుసటి రోజు నుంచి భర్త సుదామ శర్మ భార్యకు కు ఫోన్ చేశాడు. ఇంటికి రావాలని కోరాడు. కానీ ఆమె దానికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో అదే నెల 21వ తేదీన కూడా కాల్ చేశాడు. చాలా సేపు ఫోన్ లో మాట్లాడుతూ ఆమెను బతిమిలాడు. ఎంత బుజ్జగించినా భార్య మాట వినకపోవడంతో భర్త మనస్థాపానికి గురయ్యాడు. ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి ఇల్లు గ్రామానికి దూరంగా ఉంటుంది. దీంతో అతడు చనిపోయిన విషయం ఎవరికీ తెలియదు.
ఈ క్రమంలో గత బుధవారం భార్య కీర్తి శర్మ తన పిల్లలను తీసుకొని భర్త ఇంటికి వచ్చింది. ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. ఏం జరిగిందని ఖంగారుపడుతూ తలుపు తెరిచి చూసింది. భర్త ఇంట్లో విగతజీవిగా పడి ఉండటం చూసి ఒక్క సారిగా కుంగిపోయింది. అతడు చనిపోయి అప్పటికే దాదాపు 28 రోజులు అవుతుండటంతో అస్థిపంజరం మృతదేహం కుళ్లిపోయింది. ఆమె వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. దీంతో వారు అక్కడికి చేరుకున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఆత్మహత్యతో ఎవరూ ఏమీ సాధించలేరు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తే వెంటనే 9152987821 అనే ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు సహాయం చేస్తారు.