Asianet News TeluguAsianet News Telugu

కవల ఆడ‌ పిల్లలకు జన్మనిచ్చిన భార్య.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య

BHOPAL: భార్య‌ కవల ఆడపిల్లలకు జన్మనివ్వ‌డంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. నదిలో దూకి బలవంతంగా తన ప్రాణాలు తీసుకున్నాడు. ఈ షాకింగ్ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో చోటుచేసుకుంది. 
 

Madhya Pradesh: Man commits suicide after wife gives birth to twin girls
Author
First Published Jan 21, 2023, 11:53 AM IST

Balaghat: ఒక మ‌హిళ ఇద్ద‌రు ఆడ క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇప్ప‌టికే వారికి ఇద్ద‌రు ఆడ సంతానం ఉన్నారు. ప్ర‌స్తుత కాన్పుతో ఇంట్లో ఆడ పిల్ల‌లు న‌లుగురు అయ్యార‌ని మన‌స్తాపానికి గురైన ఒక భ‌ర్త బ‌ల‌వంతంగా త‌న ప్రాణాలు తీసుకున్నాడు. ఈ షాకింగ్ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో చోటుచేసుకుంది. 

వివ‌రాల్లోకెళ్తే.. భార్య‌ కవల ఆడపిల్లలకు జన్మనివ్వ‌డంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో చోటుచేసుకుంది. తన భార్య కవల ఆడపిల్లలకు జన్మనివ్వడంతో మ‌న‌స్తాపానికి గురై.. బాధతో ఓ వ్యక్తి తన జీవితాన్ని ముగించుకున్నాడని పోలీసులు తెలిపారు. క‌వ‌ల ఆడ పిల్ల‌తో క‌లిపి అతని ఇంట్లో ఉన్న మొత్తం కుమార్తెల సంఖ్య నాలుగుకు చేరుకుందని బాలాఘాట్‌లో పోలీసులు శుక్రవారం తెలిపారు. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా, మృతుడు వాసుదేవ్ పాట్లే అనే వ్యక్తి 15-20 ఎకరాల భూమిని కలిగి ఉన్న మార్బుల్ వ్యాపారి అని బాలాఘాట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కమల్ సింగ్ గెహ్లాట్ తెలిపిన‌ట్టు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. 

"అతను సాయంత్రం 6:30 గంటలకు వంతెనపై నుండి వైంగంగా నదిలోకి దూకాడు. అతని మృతదేహం గురువారం ఉదయం కనుగొనబడింది. అతని భార్య జిల్లా ఆసుపత్రిలో కవల ఆడపిల్లలకు జన్మనిచ్చిన తరువాత పాట్లే తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌య్యాడు" అని వెల్ల‌డించారు. పాట్లే తన భార్య కవల ఆడపిల్లలకు జన్మనిచ్చిన తర్వాత, కొన్ని మందులు కొనుక్కోవాలని కోరుతూ ఆసుపత్రి నుండి బయటకు వెళ్లాడని, ఆపై ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని కుటుంబ స్నేహితులు తెలిపారు. "నలుగురి తోబుట్టువులలో పాట్లే ఒక్కడే కొడుకు. అతనికి అప్పుడే పుట్టిన కవలలతో సహా నలుగురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద వాళ్ళకి ఆరు, నాలుగు సంవత్సరాలు" అని వారిలో ఒకరు చెప్పారు. ఇదిలావుండగా, బాలాఘాట్ ప్రజాసంబంధాల విభాగం అధికారి అనిల్ పాట్లే మాట్లాడుతూ జిల్లాలో 1000 మంది పురుషులకు 1022 మంది స్త్రీలు ఉన్నారని, ఆరోగ్యకరమైన లింగ నిష్పత్తి ఉందన్నారు.

రాజ‌స్థాన్ లో షాకింగ్ ఘ‌ట‌న‌.. 

కొడుకు పుట్ట‌లేద‌ని ఒక న‌వ‌జాత శిశువును ఆరు బ‌య‌ట వ‌దిలిపెట్టిన దారుణమైన ఘటన రాజస్థాన్ లోని ఝుంఝును జిల్లాలో వెలుగు చూసింది. సోమవారం ఉదయం జిల్లాలోని బుహానా భిర్ రహదారి మీద ఓ నవజాత శిశువు మృతదేహం పోలీసులకు దొరికింది. దూరంగా పొలాల్లో.. ఓ స్వీట్ బ్యాగ్ లో నవజాతశిశువు ఉందన్న సమాచారంలో అక్కడికి చేరుకున్న పోలీసులకు బాలిక కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించి.. పరీక్షించారు. అయితే అక్కడ ఆ చిన్నారి అప్పటికే చనిపోయినట్లు తేలింది. అంతేకాదు ఆ శిశువు పుట్టి పదిహేను నుంచి ఇరవై గంటలు అయి ఉంటుందని తెలిపారు. చలిని తట్టుకోలేకే ఆ చిన్నారి మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వీరి విచారణంలో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఆ చిన్నారి జన్మించినట్లు తేలింది.  అయితే తల్లిదండ్రుల ఆచూకీ లభించలేదు. ఈ దారుణానికి ఒడి కట్టిన వారికోసం వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios