Asianet News TeluguAsianet News Telugu

ప్రేమించి, ఇంటినుంచి పారిపోయి పెళ్లి.. తీరా పెద్దలు ఒప్పుకున్నాక.. భార్యను కత్తితో పొడిచి పారిపోయిన భర్త...

అత్తగారింటికి రావడానికి భార్య ఒప్పుకోకపోవడంతో చిరాకొచ్చిన భర్త ఆమెను రైల్వేస్టేషన్ లో పొడిచి పారిపోయాడు. వీరిద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. 

husband allegedly stabbed wife over disagree to come parents home in rajasthan
Author
First Published Nov 9, 2022, 11:29 AM IST

రాజస్థాన్ : పెద్దల్ని ఎదురించి, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విడిగా వచ్చి కాపురం పెట్టి సంతోషంగానే ఉన్నారు. కానీ వారిద్దరి మద్య ఓ చిన్న వివాదం ప్రాణాలమీదికి తెచ్చింది. భార్య తనతో వచ్చేందుకు నిరాకరించిందనే అక్కసుతో కత్తితో దాడి చేసి పారిపోయాడు ఆ భర్త. ఈ ఘటన రాజస్థాన్ ధోలపూర్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ జంట ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకుని బారీ అనే పట్టణంలో నివసిస్తున్నారు. అయితే, జైపూర్ లో ఉంటున్న భర్త కుటుంబ సభ్యులు ఆ మహిళతో సహా తిరిగి ఇంటికి చేయమని బలవంతం చేశారు. 

ఈ నేపథ్యంలోనే దంపతులు రైలు ఎక్కేందుకు రైల్వే స్టేషన్కు వచ్చారు. కానీ ఆమె అతడి కుటుంబ సభ్యుల వద్దకు తిరిగి వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. తనతో వచ్చేందుకు ఒప్పుకోవడం లేదన్న కోపంతో  భర్త ఆమె మీద దాడి చేసి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న ఆమె తాను చనిపోతానని భయంతో బెంచీమీద రక్తంతో తల్లిదండ్రుల మొబైల్ నెంబర్ రాసింది. ఆ తర్వాత ఆమె జీఆర్ పి జవాన్ సహాయంతో ఆస్పత్రిలో చేరినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

వైఎస్సార్ సీపీ నేత సింగరాజు వెంకట్రావు కన్నుమూత.. కన్నీటిపర్యంతమైన బాలినేని కుటుంబం...

ఇదిలా ఉండగా, హైదరాబాద్ లో ఇలాంటి దారుణ ఘటనే వెలుగు చూసింది. భార్య తనని వదిలి వేరొకరితో జీవించడం భరించలేకపోయాడు ఓ భర్త.. దీంతో దారుణానికి ఒడిగట్టాడు. మూడు నెలల గర్భిణీ అయిన తనను వదిలివెళ్లిన భార్యతో పాటు, ఆమె ప్రియుడు, వారికి పుట్టిన పది నెలల బాబుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో బాలుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  

చిక్కడపల్లికి చెందిన నాగుల సాయి (30), ఆరతి (26)లకు  ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. భర్తతో విభేదాల నేపథ్యంలో ఆమె మూడేళ్ల క్రితం  భర్త, కొడుకును వదిలి నారాయణగూడ ఫ్లై ఓవర్ వద్ద పూలు అమ్ముకునే నాగరాజు (26)తో కలిసి జీవిస్తోంది. వీరికి 10 నెలల కుమారుడు విష్ణు ఉన్నాడు. ఈ క్రమంలో తన కాపురంలో చిచ్చు పెట్టావ్ అంటూ నాగరాజుతో తరచూ నాగుల సాయి గొడవ పడేవాడు. 

సోమవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో వారి పూల దుకాణం వద్దకు వెళ్లిన నాగుల సాయి.. ముగ్గురిపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. ఈ దారుణాన్ని గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పి ముగ్గురుని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆరతి, నాగరాజులకు తీవ్ర గాయాలు కాగా, చికిత్స పొందుతూ బాలుడు మంగళవారం రాత్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios