మధ్యప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్‌పై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె ఇటీవల రేపిస్టులపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆ రాష్ట్ర సీఎస్ ను ఆదేశించింది. 

పిస్టులను బహిరంగంగా ఉరి తీయాలని మధ్యప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. ఆమె అనుచిత వ్యాఖ్యలపై 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని మధ్యప్రదేశ్ చీఫ్ సెక్రటరీని కమిషన్ ఆదేశించింది.

జనాభా నియంత్రణ చట్టంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

దీనిపై ఎంపీహెచ్‌ఆర్‌సీ (మధ్యప్రదేశ్ మానవ హక్కుల కమిషన్) సభ్యుడు మనోహర్ మమతాని మాట్లాడుతూ.. ప్రభుత్వంలో గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉంటూ ఆమె చేసిన ప్రకటన భారత రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఇది మానవ హక్కులకు విరుద్ధమని కమిషన్ గుర్తించిందని చెప్పారు. మంత్రి వ్యాఖ్యలు అనుచితమైనవని, అభ్యంతరకరమైనవని తెలిపారు.

సుప్రీంకోర్టు న్యాయపరమైన పూర్వాపరాలు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో పేర్కొన్న నిబంధనలను ప్రకారం ప్రతి ఒక్కరికీ ప్రాథమిక హక్కులు ఉన్నాయని ఈ సందర్భంగా కమిషన్ పేర్కొంది. ఖైదీలకు కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయని తెలిపింది. మంత్రి వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగల అధికారి మాత్రమే సమాధానం ఇవ్వాలని పేర్కొంది. 

భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీకి బెదిరింపులు.. ‘మధ్యప్రదేశ్‌లోకి వచ్చాక బాంబ్ వేసి చంపేస్తాం’

కాగా.. నవంబర్ 13వ తేదీన మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్‌లోని అంబేద్కర్ నగర్ మోవ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ఆ వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి. ‘‘ ఆడ కూతుళ్లపై అత్యాచారం చేసిన వారిని బహిరంగంగా కూడళ్లలో ఉరితీయాలి. అలాంటి వారి అంత్యక్రియలకు కూడా అనుమతి ఇవ్వకూడదు. అలాంటి వ్యక్తి మృతదేహాన్ని డేగలు, కాకులు పొడిచి తినాలి. ఈ దృశ్యాన్ని అందరూ చూస్తుంటే కూతుళ్లను ముట్టుకోడానికి మళ్లీ ఎవరూ సాహసించరు.’’ అని ఆమె అన్నారు. అలాంటి రేపిస్టులకు మానవ హక్కులు లేవని, మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకుంటే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు. 

Scroll to load tweet…

ఆమె వ్యాఖ్యలపై ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఇలాంటివి వీలైనంత ఎక్కువ మందికి చేరాలని, ఈ విషయాలు సమాజ హితం కోసమే అని చెప్పారు. రేపిస్టులు బహిరంగంగా నేరాలకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల వారిలో భయం లేదని చెప్పారు. రేపిస్టులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ సంతకాల ప్రచారం నిర్వహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి కుటుంబంలోని మహిళలు ఈ ప్రచారంలో పాల్గొనాలని ఠాకూర్ అన్నారు. 

వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయి.. అలా చేస్తేనే పని భారం తగ్గుతుంది: సీజేఐ

మంత్రి ఉషా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉషా ఠాకూర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. ఇటీవల మధ్యప్రదేశ్ ఖాండ్వాలో నాలుగు సంవత్సరాల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై కూడా ఆమె ఇదే విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.