Parliament Security Breach: ఇద్దరు వ్యక్తులు బుధవారం పార్లమెంటు భద్రతను ఉల్లంఘించి, పబ్లిక్ గ్యాలరీ నుండి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకారు. అనంతరం కలర్ గ్యాస్ ను విడుదల చేస్తూ పలు నినాదాలు చేశారు. అప్రమత్తమైన ఎంపీలు వారిని పట్టుకుని చితకొట్టారు.
security breach in Lok Sabha: పార్లమెంట్ లో భద్రతను ఉల్లంఘించి పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్ సభలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు. కలర్ గ్యాస్ డబ్బాలతో పొగను వదులుతూ నినాదాలు చేశారు. గతంలోనూ పార్లమెంట్ పై దాడి జరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకుని గతంలో కంటే మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నాలుగంచెల భద్రతా వ్యవస్థ ఉంది. అయినప్పటికీ ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో పార్లమెంట్ కు కల్పిస్తున్న భద్రతపై ప్రశ్నలు వస్తున్నాయి.
మునుపటి కంటే భద్రతను పటిష్టంగా ఉంచిన కొత్త పార్లమెంటులో భద్రతా ప్రక్రియపై బుధవారం జరిగిన భారీ భద్రతా ఉల్లంఘన ప్రశ్నలను లేవనెత్తింది. అయినప్పటికీ ఇద్దరు వ్యక్తులు కలర్ గ్యాస్ డబ్బాలతో సందర్శకుల గ్యాలరీలోకి ఎలా ప్రవేశించగలిగారనేది అతిపెద్ద ప్రశ్న. దీనిని సంబంధించిన టాప్ పాయింట్స్ ఇలా ఉన్నాయి..
పార్లమెంట్ దాడిలో వాడిన 'కలర్ గ్యాస్ డబ్బాలు' ఎంటో తెలుసా?
పార్లమెంట్ సెక్యూరిటీ..
- 2001 దాడి తర్వాత పాత పార్లమెంటు భవనంలో వాడుకలో ఉన్న భద్రతా ప్రక్రియను సమూలంగా మార్చారు. అప్పుడు అమల్లో ఉన్న మూడంచెల ప్రక్రియను నాలుగంచెల వ్యవస్థకు అప్ గ్రేడ్ చేశారు. అప్పటితో పోలిస్తే మెరుగైన భద్రతా పరికరాలను ఏర్పాటు చేశారు.
- ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం, సీఆర్పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) బలగాలు పార్లమెంట్ వద్ద భద్రతను కల్పిస్తాయి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఫైర్ సర్వీస్ తో సహా ఇతర ఏజెన్సీలతో కూడిన ఇతర భద్రతా విభాగాలు కూడా సెక్యూరిటీని అందిస్తాయి.
- భద్రతా విభాగాలు సందర్శకులను తనిఖీ చేయడం, వారి వస్తువులను తనిఖీ చేయడం.. ఫోన్లు, బ్యాగులు, పెన్నులు, వాటర్ బాటిళ్లు, నాణేలను కూడా పార్లమెంట్ లోపలికి అనుమతించరు. ఆధార్ కార్డును తప్పకుండా చూపించాల్సి ఉంటుంది. అలాగే మూడు ఫుల్ బాడీ స్కానర్లను దాటాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ తర్వాతే సందర్శకులకు పాసులు కేటాయిస్తారు.
- పాస్ ల జారీలో తప్పనిసరిగా బ్యాక్ గ్రౌండ్ చెకింగ్ కూడా ఉంటుంది. దీనికి తోడు సందర్శకులు పార్లమెంటు సభ్యుడు సంతకం చేసిన వారి ప్రవేశాన్ని సిఫారసు చేసే లేఖలను చూపించాలి.
- ఇక తాజా ఘటన గమనిస్తే.. ఇద్దరు వ్యక్తులు తమ బూట్లలో కలర్ గ్యాస్ పొగ డబ్బాలను దాచి ఉంచారనీ, వాటిని భౌతికంగా తనిఖీ చేస్తున్న భద్రతా సిబ్బంది మిస్ అయ్యి ఉంటారని అనుమానిస్తున్నారు. ఫుల్ బాడీ స్కానర్లను వారు ఎలా తప్పించుకున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
