పార్లమెంట్ దాడిలో వాడిన 'క‌ల‌ర్ గ్యాస్ డ‌బ్బాలు' ఎంటో తెలుసా?

Parliament Security Breach:  పార్ల‌మెంట్ భ‌ద్ర‌తా ఉల్లంఘ‌న‌కు సంబంధించి న‌లుగురు నిందితులు పోలీసులు అరెస్టు చేశారు. ఇద్ద‌రిని పార్ల‌మెంట్ లోప‌ల ప‌ట్టుకోగా, మ‌రో ఇద్ద‌రిని వెలుప‌ల అరెస్టు చేశారు. 
 

Huge Parliament Security Breach: Colour Gas Canisters Used, What Are They? RMA

security breach in Lok Sabha: పార్లమెంటు జీరో అవర్ లో ఇద్దరు వ్యక్తులు గుర్తుతెలియని పసుపు రంగులో గ్యాస్ ను వెదజల్లుతున్న పొగ డబ్బాలతో సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్ సభ ఛాంబర్ లోకి దూసుకెళ్లి గంద‌ర‌గోళం సృష్టించారు. వెంట‌నే అప్రమత్తమైన ఎంపీలు, భద్రతా సిబ్బంది లోక్ సభ చాంబర్ లో వీరిద్దరిని అడ్డుకున్నారు. ఛాంబర్ లోపలి నుంచి వచ్చిన వీడియో ఫుటేజీలో ఒక వ్యక్తి  అక్క‌డి బ‌ల్లాలు కుర్చిల‌పైన అటుఇటు క‌దులుతూ.. దట్టమైన పొగను వెదజల్లుతున్న క‌ల‌ర్ గ్యాస్ డ‌బ్బాల‌తో గంద‌ర‌గోళం సృష్టించాడు. అప్రమత్తమైన ఎంపీలు, భద్రతా సిబ్బంది ఇద్దరినీ ప‌ట్టుకున్నారు.

ఆ కలర్ గ్యాస్ డబ్బాలు ఏమిటి..? 

పార్ల‌మెంట్ లో క‌ల‌ర్ గ్యాస్ డ‌బ్బాల‌తో దాడికి పాల్ప‌డిన వారిని అరెస్టు చేయ‌గా, వారు ఉప‌యోగించిన క‌ల‌ర్ గ్యాస్ డ‌బ్బాలను స్మోక్ డబ్బాలు లేదా స్మోక్ బాంబులు అంటారు. వీటిని చాలా దేశాలలో చట్టబద్ధమైనవి ప‌రిగ‌ణిస్తున్నారు. అందుకే ఇవి దాదాపు అన్ని రిటైల్ మార్కెట్లలో లభిస్తాయి. ప్రయోజనాన్ని బట్టి వాటి వాడకం మారుతూ ఉంటుంది. ఈ డబ్బాలను సైనిక సిబ్బంది, పౌరులు క్రీడా కార్యక్రమం లేదా ఫోటోషూట్ లో ఎక్కువ‌గా ఉపయోగిస్తారు.

స్మోక్ గ్రెనేడ్ల నుండి వెలువడే దట్టమైన పొగ ద్వారా ఏర్పడే స్మోక్ స్క్రీన్లను సైనిక, చట్ట అమలు కార్యకలాపాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. దట్టమైన రంగుతో కూడిన ఈ పొగ దళాల కదలికలను గుర్తించ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అలాగే, యుద్ధ స‌మ‌యంలో శత్రువుల కంటికి కనిపించకుండా చేయ‌డంతో సైనిక దాడుల సమయంలో కీలకమైన రక్షణను అందిస్తాయి. వైమానిక దాడులు, ట్రూప్ ల్యాండింగ్ లు, తరలింపు పాయింట్ల కోసం టార్గెట్ జోన్ లను గుర్తించడంలో కూడా క‌ల‌ర్ గ్యాస్ డ‌బ్బాలు (స్మోక్ బాంబులు) ఉపయోగిస్తారు.

ఇక ఫోటోగ్రఫీలో మంరిత ఆక‌ర్ష‌ణీయంగా ఫొటో షూట్ ఉండాడానికి, ఫొటో ఎఫెక్టులు, భ్రమలను సృష్టించడానికి గ్యాస్ క‌ల‌ర్ టిన్ ల‌ను ఉప‌యోగిస్తారు. క్రీడలలో, ముఖ్యంగా ఫుట్ బాల్ లో, అభిమానులు తమ తమ క్లబ్ ల రంగులను ప్రదర్శించడానికి స్మోక్ డబ్బాలను ఉపయోగిస్తారు. యూరోపియన్ ఫుట్ బాల్ లో, అభిమాన సంఘాలు లేదా 'అల్ట్రాస్' అని తరచుగా పిల‌స్తుంటారు. సందర్శన జట్లకు భయపెట్టే వాతావరణాన్ని సృష్టించడానికి క‌ల‌ర్ గ్యాస్ టిన్, పైరోలను ఉపయోగిస్తారు. 

పార్ల‌మెంట్ దాడి ఘ‌ట‌న‌లో న‌లుగురు అరెస్టు..

పార్ల‌మెంట్ లో భ‌ద్ర‌తను ఉల్లంఘించి.. క‌ల‌ర్ గ్యాస్ డ‌బ్బాల‌తో దాడి చేసిన ఇద్ద‌రిని పార్ల‌మెంట్ లోప‌ల ప‌ట్టుకుని అరెస్టు చేశారు. మ‌రో ఇద్ద‌రిని పార్ల‌మెంట్ బయట అరెస్టు చేశారు. పసుపు రంగు పొగను విడుదల చేసే కంటైనర్లతో గంద‌ర‌గోళం సృష్టించిన ఇద్ద‌రితో పాటు పార్లమెంటు భవనం సమీపంలో నిరసన తెలుపుతున్న ఒక వ్యక్తిని, ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు నీలం (42), అమోల్ షిండే (25)లుగా గుర్తించామ‌నీ, ట్రాన్స్ పోర్ట్ భవన్ ఎదుట అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

విచారణకు స్పీకర్ హామీ.. 

ఈ ఘ‌ట‌న త‌ర్వాత పార్ల‌మెంట్ స‌మావేశాలు వాయిదాప‌డ్డాయి. ఇక ప‌రిస్థితులు అదుపులోకి వ‌చ్చిన త‌ర్వాత మధ్యాహ్నం 2 గంటలకు లోక్ సభ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ క్ర‌మంలోనే ఆందోళనకు దిగిన పార్లమెంటేరియన్లను ఉద్దేశించి స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. "మేము ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నాము. ద‌ర్యాప్తు చేయాల‌ని ఇప్ప‌టికే ఢిల్లీ పోలీసులను కోరాము. క‌ల‌ర్ గ్యాస్ టిన్ ల గురించి నాకు అప్డేట్ వచ్చింది. దీని వల్ల పెద్దగా ముప్పు లేదు. వాటన్నింటికీ నేను హామీ ఇవ్వాలనుకుంటున్నాను. నేనూ ఇక్కడే ఉన్నాను. మీ అందరితో కలిసి ఇక్కడ కూర్చున్నారు. దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు బయటకు వచ్చే వరకు వేచిచూద్దాం" అని తెలిపారు. 

పార్లమెంట్‌లో దాడి.. గ్యాస్ లీక్ చేస్తూ కలకలం.. ఏం జరిగింది?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios