ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ జిల్లాలో ఉన్న పధమ్ పట్టణంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. ఈ ప్రమాదంపై సీఎం యోగి ఆధిత్యనాథ్ సంతాపం తెలిపారు. 

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మంటల వల్ల మొత్తంగా ఆరుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్ కుమార్ అనే ఎలక్ట్రానిక్స్ అండ్ జ్యువెలరీ షాప్ యజమాని, తన తొమ్మిది మంది కుటుంబ సభ్యులతో కలిసి కలిసి భవనంలో నివసించేవాడు. 

లవ్ జిహాద్ ఉగ్రవాదానికి కొత్త రూపం: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

వీరు నివసించే భవనం జస్రానా ప్రాంతంలోని పధమ్ పట్టణంలో ఉండేది. అయితే మంగళవారం సాయత్రం వారి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో మంటలు చెలరేగాయి. వెంటనే ఆగ్రా, ఎటా, మెయిన్ పూర్, ఫిరోజ్ బాద్ కు చెందిన 18 అగ్నిమాపక యంత్రాలు, 12 స్టేషన్ల పోలీసు సిబ్బంది రంగంలోకి దిగారు. 

మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. రామన్ కుమార్ తో పాటు మరో ఐదుగురు ఈ ఘటనలో చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. కాగా ఈ ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా భావిస్తున్నామని ఫిరోజాబాద్ ఎస్పీ ఆశిష్ తివారీ తెలిపారు.

Scroll to load tweet…

సీఎం యోగి సంతాపం.. 
ఫిరోజాబాద్ జిల్లాలోని జస్రానాలో జరిగిన ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి తన సంతాపాన్ని తెలియజేశారు. ఆసుపత్రిలో చేరిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని యోగి ఆదిత్యనాథ్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. దీంతో పాటు సీనియర్ జిల్లా ఆఫీస్ బేరర్లు, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

నోట్ల రద్దు, జీఎస్టీతో ప్ర‌జ‌లు, చిరు వ్యాపారుల వెన్నువిరిచారు.. బీజేపీపై రాహుల్ గాంధీ విమ‌ర్శ‌లు

కాగా.. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని సీఎం యోగి జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారని యూపీ సీఎంవో ట్వీట్ చేసింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారని ఆ ట్వీట్ లో పేర్కొంది.