Asianet News TeluguAsianet News Telugu

లవ్ జిహాద్ ఉగ్రవాదానికి కొత్త రూపం: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

Ghazipur: లవ్ జిహాద్ ఉగ్రవాదానికి కొత్త రూపమ‌ని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. "లవ్ జిహాద్ రూపంలో ఉగ్రవాదం కొత్త రూపు దాల్చింది.. భారత్‌లో ‘సనాతన ధర్మాన్ని’ అంతం చేసేందుకు ఈ మురికి కుట్రకు తెర‌లేపారు" అని కేంద్ర‌మంత్రి పేర్కొన్నారు.

Love jihad is a new form of terrorism: Union Minister Giriraj Singh
Author
First Published Nov 30, 2022, 4:59 AM IST

Union Minister Giriraj Singh: సనాతన ధర్మాన్ని తుదముట్టించేందుకు లవ్ జిహాద్ రూపంలో ఉగ్రవాదం కుట్ర పన్నుతున్నదనీ, దానికి వ్యతిరేకంగా అంద‌రూ ఏకం కావాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే కృష్ణానంద్‌రాయ్‌ వర్ధంతి సందర్భంగా మహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మాట్లాడారు. ఉగ్రవాదం లవ్ జిహాద్ రూపంలో కొత్త రూపు దాల్చిందని.. భారత్‌లో ‘సనాతన ధర్మాన్ని’ అంతం చేసేందుకు మురికి కుట్ర పన్నుతున్నదనీ, అంద‌రూ ఏకమై ఈ కుట్రను భగ్నం చేయాలని అన్నారు. అలాగే, జనాభా నియంత్రణ చట్టాలను రూపొందించాల్సిన అవసరాన్ని సమర్ధించిన సింగ్, ఇటువంటి విధానాలు దేశ సమగ్ర అభివృద్ధికి హామీ ఇస్తాయని అన్నారు. చైనాలో నిమిషానికి 10 మంది పిల్లలు పుడుతుండగా, భారత్‌లో నిమిషానికి 31 మంది పిల్లలు పుడుతున్నారనీ, దీని కారణంగా ఇప్పటి వరకు అభివృద్ధి వేగంగా జరగలేదన్నారు. రాష్ట్రంలో నేరాలను అదుపు చేస్తున్నందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మంత్రి అభినందించారు.

అలాగే, బిహార్‌లో మత మార్పిడులు చాలా వేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మంగళవారం అన్నారు. మ‌హాఘ‌ట్భంధన్ ప్రభుత్వం తన ముస్లిం ఓటు బ్యాంకు గురించి మాత్రమే ఆందోళన చెందుతోందని ఆరోపించారు. బలమైన మతమార్పిడి నిరోధక చట్టం అవసరమని మంత్రి పునరుద్ఘాటించారు. హిందూ ద్వేషులను ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నారని రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. "బీహార్‌లో పాలక మ‌హాఘ‌ట్భంధన్ తన స్వంత ముస్లిం ఓటు బ్యాంకుకు సంబంధించినది.. విపరీతమైన వేగంతో జరుగుతున్న మతమార్పిడులను గురించి ప్ర‌స్తావించారు. "సీమాంచల్ ప్రాంతంలో (నేపాల్, పశ్చిమ బెంగాల్ సరిహద్దులో) పరిస్థితి చాలా తీవ్రంగా మారింది. ఆ జిల్లాలను సందర్శించినట్లయితే ఎవరైనా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించారా? అని ఆశ్చర్యపోతారు" అని ఆయన ఆరోపించారు.

తన సొంత నియోజకవర్గమైన బెగుసరాయ్‌తో సహా బీహార్‌లోని ఇతర జిల్లాల్లో కూడా క్రైస్తవ మిషనరీలు మత మార్పిడులకు పాల్పడుతున్నారని సింగ్ ఆరోపించారు. బెదిరింపులు లేదా ప్రలోభాల ద్వారా మత మార్పిడిని నిషేధించే చట్టం మాత్రమే ఆటుపోట్లను అరికట్టగలదని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని భార‌త్ జోడో యాత్ర గురించి ప్రశ్నించ‌గా, ఆయ‌నొక రాజు కొడుక‌నీ, ఆయ‌న గురించి చెప్ప‌డానికి నేను ఏవ‌రంటూ ప్ర‌శ్నించారు. "ఆయ‌న (రాహుల్ గాంధీ) భారత్‌ను ఏకం చేస్తున్నాడా లేదా హిందువులపై ద్వేషంతో నిండిన 'తుక్డే-తుక్డే' ముఠా, క్రైస్తవ మతగురువులను ఏకతాటిపైకి తీసుకువస్తున్నాడా? " అని  ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ నాయకుడు సద్దాం హుస్సేన్‌ను పోలి ఉన్నాడని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యను పరోక్షంగా ప్రస్తావిస్తూ, “మిరియాలు, ఉప్పు గడ్డం ప్రజలకు ఎవరిని గుర్తు చేస్తుంది?” అని గిరిరాజ్ సింగ్  పేర్కొన్నారు.

అంత‌కుముందు, తనను నాశనం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కోట్లు ఖర్చు పెడుతున్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సోమవారం మండిపడ్డారు. 'సొంత పార్టీని నాశనం చేస్తున్న వ్యక్తి, నాశనం చేయడం గురించి ఎలా మాట్లాడగలడు' అని బీజేపీ మంత్రి అన్నారు. ముస్లిం సమాజంపై ప్రభుత్వానికి ఎలాంటి ద్వేషం లేదనీ, అయితే రాడికల్ కరడుగట్టినవారు సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని కేంద్ర మంత్రి అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios