Asianet News TeluguAsianet News Telugu

హిజాబ్ వివాదాన్ని అధిగమించి టాపర్‌గా నిలిచిన తబస్సుమ్.. ఆమె ఏం చెబుతుందంటే..

కర్ణాటకలో  హిజాబ్ వివాదం ఎంత చర్చనీయాంశంగా మారిందనే సంగతి తెలిసిందే. అయితే హిజాబ్ వివాదాన్ని అధిగమించి ముందుకు సాగిన ఓ విద్యార్థిని చదువులో సత్తా చాటింది. 

how Tabassum Shaik overcame hijab row and becomes Karnataka 2nd PUC arts topper ksm
Author
First Published Apr 28, 2023, 1:06 PM IST

బెంగళూరు: కర్ణాటకలో  హిజాబ్ వివాదం ఎంత చర్చనీయాంశంగా మారిందనే సంగతి తెలిసిందే. అయితే హిజాబ్ వివాదాన్ని అధిగమించి ముందుకు సాగిన ఓ విద్యార్థిని చదువులో సత్తా చాటింది. కర్ణాటక స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డులో 12వ తరగతి పీయూసీ పరీక్షలో హ్యుమానిటీస్ స్ట్రీమ్‌లో 600 మార్కులకు 593 సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఆమె 18 ఏళ్లు తబస్సుమ్ షేక్. వివరాలు.. 2022లో ప్రభుత్వం కళాశాల యూనిఫాం నిబంధనను కఠినంగా అమలు చేయడంతో దక్షిణాది రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలోని ప్రైవేట్ పీయూసీ కళాశాలలో ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఇది జిల్లావ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నలుగురు మహిళలు నిబంధనను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు.

అయితే అటువంటి సమయంలో హిజాబ్ వివాదాన్ని అధిగమించి తబస్సుమ్ షేక్ షేక్ విజయాన్ని సాధించారు. ఎన్ఎంకేఆర్‌వీ పీయూ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో చదవిని తబస్సుమ్.. మొదటి సంవత్సరం కొంత సాఫీగా సాగిందని చెప్పారు. సంవత్సంరం చివరిలో చాలా ఇబ్బందులు, అనిశ్చితులు నెలకొన్నాయని చెప్పారు. హిజాబ్ ధరించకుండా  క్లాస్‌లకు హాజరుకావాల్సి వచ్చిందని చెప్పారు. అయితే హిజాబ్ తీసేయడానికి సంకోచించినప్పటికీ.. నిబంధనల ప్రకారం దానిని అనుసరించాల్సి వచ్చింది. 

ఈ పరిస్థితుల్లో మధ్య తాను చదవుతున్న స్ట్రీమ్‌లో టాపర్‌లో నిలిచిన తబస్సుమ్ పరీక్షలలో విజయం సాధించేందుకు చిట్కాలతో పాటు, తన అనుభవాలను పంచుకుంది. సాధారణంగా చదువుకోవడానికి ఉత్తమ సమయం ఉదయం 4 నుంచి 8 గంటల మధ్య అని ఆమె చెప్పింది. ఆ సమయంలో తన మైండ్ ఫ్రెష్‌గా, ఫ్రీగా ఉంటుందని  తెలిపింది.  అందుకే చదువుకోవడానికి అదే ఉత్తమ సమయం అని తాను అనుకుంటున్నానని పేర్కొంది. 

ఎనర్జీ మేనేజ్‌మెంట్.. తాను అత్యధిక శక్తి, ఖాళీ మనస్సును కలిగి ఉన్నప్పుడు చాలా కష్టమైన అధ్యాయాలను చదివినట్టుగా తబస్సుమ్ తెలిపింది. అది తెల్లవారుజామున 4 నుంచి 8 మధ్య ఉందని తాను గుర్తించానని పేర్కొంది. 

అయితే హిజాబ్‌పై విద్యను ఎంచుకోవాలని తబస్సుమ్ తల్లిదండ్రులు ఆమెకు సలహా ఇచ్చారు. దీంతో ఆమె హిజాబ్ వివాదాన్ని అధిగమించింది. హిజాబ్ ధరించిన తబస్సుమ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ..‘‘హిజాబ్ సమస్యను పక్కనపెట్టి చదువుపై దృష్టి పెట్టాలని నా తల్లిదండ్రులు నాకు సలహా ఇచ్చారు. నేను 95 శాతం మార్కులను ఆశించాను’’ అని చెప్పారు. 

అయితే హ్యుమానిటీస్ స్ట్రీమ్‌లో స్టేట్‌లో అగ్రస్థానంలో నిలిచిన వార్తను తెలియజేయడానికి కాలేజ్ టీచర్లలో ఒకరు తబస్సుమ్‌ను సంప్రదించినప్పుడు ఆమెడు ఆమె నిద్రపోతోంది. ఇక, ఈ విషయంలో తన తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉన్నారని ఆమె చెప్పింది. ఐదేళ్ల వయసు నుంచి తనకు హిజాబ్ ధరించడం అలవాటుగా మారిందని తబసుమ్ తెలిపింది. ‘‘ఇది నా గుర్తింపులో భాగం. అయితే ఈ వివాదం కారణంగా నేను చాలా విచారం చెందాను. అలాగే కలవరపడ్డాను’’ అని  పేర్కొంది. 

నో-హిజాబ్ నిబంధన విధించడం ముస్లింలను వెనుకబడి, విద్యకు దూరం చేయడానికి ఒక ఎత్తుగడ అని.. అది సరైనది కాదని హిజాబ్ వివాదం సమయంలో తబస్సుమ్‌కు ఆమె తల్లిదండ్రులు చెప్పారు. తబస్సుమ్‌ తండ్రి అబ్దుల్ ఖామ్ షేక్ వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. అయితే తాము చట్టాన్ని అనుసరిస్తానని, దాని ప్రకారం తన కుమార్తెకు కౌన్సెలింగ్ ఇచ్చామని  చెప్పారు. 

తన క్రమబద్ధమైన స్వీయ-అధ్యయన, కాలేజీలో ఉన్న ఉత్తమ ఉపాధ్యాయుల కారణంగా పరీక్షలో అగ్రస్థానంలో నిలిచానని  చెప్పింది. కాలేజ్ తమకు సెల్ఫ్ స్టడీస్ కోసం ఒక నెల రోజుల సెలవు మంజూరు చేయడం మంచి పరిణామం అనిపేర్కొంది. ఆ సమయంలో తమ సందేహాలను నివృత్తి చేయడానికి, మార్గదర్శకత్వం కోసం తమ టీచర్లను ఎప్పుడైనా సంప్రదించే అవకాశం ఉండేదని.. ఇది గేమ్ ఛేంజర్ అని తెలిపింది. ఆ నెలలో ఆమె రోజుకు 8-9 గంటలు చదువుకోవడంలో మునిగిపోయింది. 

హిజాబ్ విషయానికి వస్తే, తబస్సుమ్ మాట్లాడుతూ.. ముస్లిం మహిళలపై ఎవరూ హిజాబ్ కప్పడం లేదు. ‘‘అకస్మాత్తుగా హిజాబ్ ధరించమని మిమ్మల్ని అడగడం కాదు. నేను దాని గురించి నా తల్లిదండ్రులను ప్రశ్నించాను. అందుకు సమాధానాలు పొందిన తర్వాత మాత్రమే నేను దానిని తీసుకున్నాను’’ అని స్పష్టం చేసింది. హిజాబ్ వివాదం బాధ కలిగించిందని తబస్సుమ్ అంగీకరించింది. “నేను చాలా బాధపడ్డాను. అన్యాయం అనుకున్నాను. నేను రెండు వారాల పాటు కాలేజీని కోల్పోయాను. నేను నిరుత్సాహానికి, గందరగోళానికి గురయ్యాను. ఏమి చేయాలని ఆలోచించాను’’ అని  తబస్సుమ్ పేర్కొంది. 

ఈ రోజు తబస్సుమ్.. కాలేజ్ లోపల హిజాబ్‌ను తీసివేయడం కంటే ఓపెన్ స్కూల్ నుంచి పరీక్ష రాయడాన్ని ఎంచుకున్నతన సహవిద్యార్థులు, కాలేజ్‌ను విడిచిపెట్టిన స్నేహితుల పట్ల చాలా బాధగా ఉంది. కాలేజీకి వెళ్లే దారిలో తాను హిజాబ్‌ను ధరించి.. కాలేజీ అధికారులు అందించిన నిర్ణీత గదిలో దానిని తీసివేసానని  చెప్పింది. హిజాబ్ పేరుతో విద్యను వదులుకోవద్దని.. బదులుగా వారి చదువును పూర్తి చేయాలని ఆమె మహిళలకు సలహా ఇచ్చింది. భారతదేశం వైవిధ్యం కలిగిన దేశమని.. సర్దుబాటు చేసుకోవాలి అని కూడా తబస్సుమ్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. 

సమాజాన్ని అర్థం చేసుకోవడంలో, వ్యక్తులతో కనెక్ట్ అవ్వడంలో మానవీయ శాస్త్రాలు - సామాజిక శాస్త్రాలు, చరిత్ర, మనస్తత్వశాస్త్రం, సాహిత్యం వంటివి మరింత సందర్భోచితంగా ఉండగా.. విజ్ఞాన శాస్త్రాలు అధికంగా ఉన్నాయని ఆమె గుర్తించింది. తబస్సుమ్ తన భవిష్యత్తు గురించి మాట్లాడుతూ.. తాను క్లినికల్ సైకాలజిస్ట్ కావాలనుకుంటున్నానని చెప్పింది. ప్రస్తుతం ఆమె బెంగుళూరులోని RV విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌ను అభ్యసించాలని యోచిస్తోంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన తబస్సుమ్ అన్నయ్య ప్రస్తుతం ఎంటెక్ చదువుతున్నాడు.

కాలేజీలో నోట్స్ తయారు చేసుకోవడం, ఆ తర్వాత ఇంట్లో రివైజ్ చేసుకోవడం అనే అలవాటుగా తనకు ఉపయోగపడిందని తబస్సుమ్ చెప్పింది. విద్యా సంవత్సరం ప్రారంభంలో.. మునుపటి ప్రశ్నపత్రాలన్నింటినీ అధ్యయనం చేయడానికి తన కళాశాలలోని లైబ్రరీని సందర్శించింది. వాటిలో పునరావృతమయ్యే ప్రశ్నలను తీసివేసి, తప్పనిసరిగా అధ్యయనం చేయవలసిన కీలక ప్రశ్నల జాబితాను రూపొందించింది.

ఇక, చదవులపై మాత్రమే కాకుండా.. తబస్సుమ్ ప్రత్యేకంగా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ట్యుటోరియల్స్ కోసం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, యూట్యూబ్‌లలో సిట్‌కామ్‌లను చూస్తుంది. ఆమె యానిమేషన్ చిత్రాలను కూడా ఇష్టపడుతుంది. ఆమె పరీక్ష కోసం కష్టపడి చదివిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి, చైతన్యం నింపడానికి వాటిని చూస్తుంది. ఆమె తన పదజాలం పెంచుకోవడానికి పుస్తకాలు చదువుతుంది. తన మనసులోని మాటను చెప్పడం ముఖ్యమైనదని తబుస్సమ్ పేర్కొంది. మనసులో ఏ ఆలోచన వచ్చినా తెలియజేయాలని చెబుతోంది. 

-(ఆశా ఖోసా)

Follow Us:
Download App:
  • android
  • ios