పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)పై ఇటీవల అఫ్రిదీ మాట్లాడుతూ.. భారత సైన్యాన్ని తక్కువ చేస్తూ మాట్లాడాడు. ‘‘ఈ దాడిని భారత సైన్యం ఎందుకు అడ్డుకోలేకపోయింది?’’ అని అనుచిత పదజాలంతో భారత్‌పై మాట్లాడాడు. అఫ్రిదీ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
పహల్గాంలో ఉగ్రవాదుల దాడితో భారత్-పాక్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో భారత సైన్యాన్ని ఉద్దేశిస్తూ పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ (Shahid Afridi) అనుచిత కామెంట్లు చేశాడు. దీనికి భారత క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఇంకెంత దిగజారుతారని.. పాక్ ఆటగాడికి గట్టి జవాబు ఇచ్చాడు.
‘‘మేం పాకిస్తాన్ ని కార్గిల్ యుద్ధంలో ఓడించాం. అది మర్చిపోయారా? ఇప్పటికే పాకిస్తాన్ దారుణంగా పతనమైంది. ఇంకా ఎంతకు దిగజారుతారు? ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానేసి.. మీ దేశం అదే పాకిస్తాన్ పరిస్థితిని ఇంప్రూవ్ చేసుకోవడంపై దృష్టి సారించండి. భారత సైన్యాన్ని చూసి మేమంతా గర్వపడుతున్నాం’’ అని ధావన్ ‘ఎక్స్’ లో అఫ్రిదీపై మండిపడ్డాడు.
పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)పై ఇటీవల అఫ్రిదీ మాట్లాడుతూ.. భారత సైన్యాన్ని తక్కువ చేస్తూ మాట్లాడాడు. ‘‘ఈ దాడిని భారత సైన్యం ఎందుకు అడ్డుకోలేకపోయింది?’’ అని అనుచిత పదజాలంతో భారత్‌పై మాట్లాడాడు. అఫ్రిదీ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
పహల్గాం దాడికి పాక్ సీమాంతర ఉగ్రవాదమే కారణమని స్పష్టం చేసిన భారత్.. పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అప్పటినుంచి పాకిస్తాన్ మంత్రులు , నేతలతో పాటు అక్కడి మీడియా కూడా భారత దేశంపై అక్కసు వెళ్లగక్కుతోంది. భారత సైన్యానికి వ్యతిరేకంగా అన్నింటా ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పాక్‌కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఇందులో మాజీ పేసర్ షోయిబ్ అక్తర్ చానెల్ కూడా ఉంది.