Asianet News TeluguAsianet News Telugu

మ‌ధ్య‌ప్ర‌దేశ్ నే రక్షించలేదు.. మ‌హారాష్ట్రను ఎలా కాపాడుతారు ? - క‌మ‌ల్ నాథ్ పై శివ‌రాజ్ సింగ్ చౌహాన్ సెటైర్స్

మహారాష్ట్ర రాజకీయ పరిశీలకుడిగా సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం కమల్ నాథ్ ని నియమిస్తూ AICC తీసుకున్న నిర్ణయాన్ని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. ఓ ఎన్నికల ప్రచార సభలో కమల్ నాథ్ ను ఎగతాళి చేస్తూ మాట్లాడారు. 

How can Kamal Nath save Maharashtra if he can save Madhya Pradesh? - Shivraj Singh Chauhan
Author
Ujjain, First Published Jun 23, 2022, 8:18 AM IST

సొంత రాష్ట్రం మ‌ధ్య‌ప్ర‌దేశ్ నే రక్షించుకోలేని క‌మ‌ల్ నాథ్ మ‌హారాష్ట్రను ఎలా కాపాడుతార‌ని బీజేపీ  నాయ‌కుడు, సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. మ‌హారాష్ట్రలో రాజ‌కీయ సంక్షోభం నెల‌కొన‌డంతో కాంగ్రెస్ పార్టీ త‌న ప‌రిశీల‌కుడిగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ సీఎం క‌మ‌ల్ నాథ్ ను నియమించింది. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణ‌యాన్ని శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ఎగతాళి చేశారు. రాష్ట్రంలోని ఉజ్జయినిలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. కాంగ్రెస్ చివ‌రి క్ష‌ణాల‌ను లెక్కిస్తోంద‌ని విమ‌ర్శించారు. 

Bypolls : 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నిక‌లు.. ? ఎక్క‌డెక్క‌డంటే ?

‘‘ కమల్ నాథ్ మహారాష్ట్రకు వెళ్లారు. మధ్యప్రదేశ్‌లో సొంత ప్రభుత్వాన్నికాపాడుకోలేకపోయారు. ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని ఎలా కాపాడుకుంటాడు. ?.. కాంగ్రెస్ చివరి క్షణాలు లెక్కబెడుతోంది’’ అని అన్నారు. కార్పొరేష‌న్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు  ఉజ్జ‌యినిలో ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భలో సీఎం ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ కార్యకర్తకు స‌రైన గౌర‌వం ఇవ్వడం లేద‌ని ఆరోపించారు. ఆ పార్టీకి ఉజ్జయినిలో టిక్కెట్టు ఇచ్చే అభ్యర్థి కనిపించడం లేద‌ని, అందుకే తరానా నుంచి ఎమ్మెల్యేను తీసుకొచ్చార‌ని విమ‌ర్శించారు. తరానాను చెడగొట్టిన వ్య‌క్తి ఉజ్జ‌యిని ఏం చేస్తారో అని అన్నారు. 

కాంగ్రెస్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇస్తోంద‌ని ఆరోపించారు. కానీ బీజేపీ కింది స్థాయిలో ఉన్న కార్య‌క్త‌ర‌ల‌ను ఎంచుకొని టిక్కెట్లు ఇస్తోంద‌ని తెలిపారు. తాము ఎమ్మెల్యేల‌కు బ‌దులు కార్యకర్తలకే ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని అన్నారు. ఈ సందర్భంగా నగరంలోని మొత్తం 54 వార్డుల్లో బీజేపీ అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని సీఎం విజ్ఞప్తి చేశారు. ఉజ్జయిని నగరాన్ని అందంగా తీర్చిదిద్దుతామని ఆయ‌న అన్నారు. ఉజ్జయిని ప్రపంచంలోనే అద్భుతమైన నగరం అవుతుంద‌ని హామీ ఇచ్చారు. ఈ న‌గ‌రానికి రూ.46000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. దీని వ‌ల్ల దాదాపు లక్ష మందికి ఉపాధి లభించనుంద‌ని చెప్పారు. 

Ayodhya Kissing Wife : న‌దిలో భార్యను ముద్దుపెట్టుకున్న‌ భర్తను చితక్కొట్టిన జ‌నం.. VIDEO వైర‌ల్

ఈ ప్ర‌సంగం సంద‌ర్భంగా కమల్‌నాథ్ ప్రభుత్వంపై సీఎం తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. గతంలో బీజేపీ ప్రారంభించిన అన్ని ప‌థ‌కాలను కాంగ్రెస్ నిలిపివేసింద‌ని, క‌నీసం పేద‌ల‌కు రేష‌న్, నీటిని క‌ల్పించే ప‌థ‌కాల‌ను కూడా ఆపేశార‌ని ఆరోపించారు. అందుకే ఓటు వేసే స‌మ‌యంలో ప్ర‌జ‌లు అలోచించాల‌ని అన్నారు. కాంగ్రెస్ బోర్డు పెడితే ఏ పనీ జరగద‌నీ, అవ‌న్నీ ఆగిపోతాయ‌ని చెప్పారు. ఆ పార్టీ మొత్తం స‌మ‌యం పోరులోనే గ‌డుపుతుంద‌ని, ఇక అభివృద్ధి ఏం చేస్తుంద‌ని సీఎం తీవ్రంగా దుయ్య‌బ‌ట్టారు.  గత 15 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉజ్జయిని నగర స్వరూపమే మారిపోయిందని తెలిపారు. అభివృద్ధికి చిత్తశుద్ధి కూడా అవసరమని అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో నగరంలోని సరస్సు ధ్వంసమైందని ఆరోపించారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వ హయాంలో రుద్రసాగర్‌ అభివృద్ధి చెందుతోంద‌ని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios