Asianet News TeluguAsianet News Telugu

Ayodhya Kissing Wife : న‌దిలో భార్యను ముద్దుపెట్టుకున్న‌ భర్తను చితక్కొట్టిన జ‌నం.. VIDEO వైర‌ల్

Ayodhya Kissing Wife : అయోధ్యలోని సరయూ నదిలో స్నానం చేస్తున్న యువ జంట‌పై కొందరు దాడి చేసి భర్తను దారుణంగా కొట్టి దుర్భాషలాడారు. ఈ ఘ‌ట‌న అయోధ్య కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సరయూ నది ఒడ్డున మంగళవారం జ‌రిగింది. దీనికి సంబంధించిన వీడియో బుధవారం వైరల్‌గా మారింది. 
 

Man Beaten For Kissing His Wife While Bathing In Ayodhya River
Author
Hyderabad, First Published Jun 23, 2022, 12:30 AM IST

Ayodhya Kissing Wife: కట్టుకున్న భార్యను ముద్దు పెట్టుకున్న భర్త‌ను చితక్కొట్టారు. ఎంత బ‌తిమిలాడినా  ఆ భర్త‌ను విడిచిపెట్ట‌లేదు. అదేంటీ..?  భార్య‌ను ముద్దు పెట్టుకోవ‌డంలో త‌ప్పెంటీ ? క‌ట్టుకున్న భార్య‌ను ముద్దు పెట్టుకోవడం ఏమైనా నేరామా? భార్యకు కాకుండా వేరే మహిళకు ముద్దుపెట్టుకుంటే.. త‌ప్పు కానీ.. భార్యను ముద్దు పెట్టుకుంటే.. ఎందుకు కొట్టార‌నే సందేహం వచ్చింది కదా! అసలేం జరిగిందంటే.. 

అయోధ్యలోని స‌ర‌యూ న‌దిలో ఓ న‌వ‌ జంటకు చేదు అనుభవం ఎదురైంది. ఈ నదిని భ‌క్తులు ప్ర‌వితంగా భావించి.. పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అదే సమయంలో ఓ జంట స్నానం కోసం నదిలోకి దిగింది. అయితే.. వారికి ఏమైందో ఏమో కానీ, వారు ఎక్క‌డ ఉన్నారో మరిచిపోయారు. ఆ న‌దినే స్మిమింగ్ పూల్ గా భావించారో ఏమో.. అంద‌రూ చూస్తుండగానే ఆ జంట‌ లిప్ టు లిప్ కిస్ చేసుకుంటూ రెచ్చిపోయారు. వారి సృతి మించిన వ్య‌వ‌హ‌రాన్ని చూసిన చుట్టుపక్కల భ‌క్తుల‌కు పిచ్చ కోపం వచ్చింది. ఆ దంపతులపై మండిపోయింది. తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. భార్య ముందే భర్తకు నాలుగు తగిలించారు.

పవిత్రమైన ప్రదేశంలో ముద్దులాడుకుంటారా? అంటూ భార్య ఎదుటే.. భర్త చెంపలు వాయించారు. దీంతో ఆ జంట షాక్ గురైంది. ఆ భార్య వారిని ఎంత బతిమిలాడినా జనాలు మాత్రం భర్తను విడిచిపెట్టకుండా దాడి చేశారు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ విషయంపై పోలీసులు ఏమంటారంటే..?

అయోధ్యలో రాముడి పాదాలపై సరయూ నదిలో స్నానం చేస్తున్న భార్యాభర్తలపై కొందరు దాడి చేసి భర్తను దారుణంగా కొట్టి దుర్భాషలాడారు. అయోధ్య కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సరయూ నది ఒడ్డున మంగళవారం ఈ ఘటన జరిగిందని, దీనికి సంబంధించిన వీడియో బుధవారం వైరల్‌గా మారిందని పోలీసులు తెలిపారు. అయితే.. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అయితే, పోలీసులు ఈ విషయంపై విచారణ జరుపుతున్నారు. దాడి చేసిన నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios