Asianet News TeluguAsianet News Telugu

Bypolls : 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నిక‌లు.. ? ఎక్క‌డెక్క‌డంటే ?

పలు కారణాల వల్ల దేశం వ్యాప్తంగా ఖాళీ అయిన 3 లోక్ సభ స్థానాలకు, 7 శాసన సభ స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు జరగనున్నాయి. మూడు రోజుల తరువాత ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

Bypolls : Elections for 3 Lok Sabha and 7 Assembly seats today? Where else?
Author
New Delhi, First Published Jun 23, 2022, 6:58 AM IST

3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీని కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా చోట్ల పోలీసు బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. వివిధ కార‌ణాల వల్ల ఖాళీ అయిన ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల‌కు నేడు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో ఈరోజు పంజాబ్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఈరోజు ఉప ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 26న ఓట్ల లెక్కింపు ఉండ‌నుంది.

పంజాబ్
పంజాబ్ రాష్ట్రం సంగ్రూర్ లోక్ సభ స్థానానికి నేడు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీని కోసం ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గుర్మెల్ సింగ్, బీజేపీ నుంచి కాంగ్రెస్ మాజీ నేత కేవల్ సింగ్ ధిల్లాన్, కాంగ్రెస్ నుంచి దల్వీర్ సింగ్ గోల్డీ పోటీ చేయనున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ధురి నియోజకవర్గం నుంచి ప్ర‌స్తుత పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ గెలుపొందారు. అయితే ఆయ‌న అంత‌కు ముందు సంగ్రూర్ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి బాధ్యత వ‌హించారు. ఎమ్మెల్యేగా గెలిచి, సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో ఇక్క‌డ ఎన్నిక‌ల అనివార్యం అయ్యింది. 

Agnipath Protest: రాష్ట్ర సర్వీసుల్లో అగ్నివీరుల‌కు రిజ‌ర్వేష‌న్లు: గోవా సీఎం ప్రమోద్ సావంత్ కీల‌క నిర్ణయం

ఢిల్లీ
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా గత నెలలో రాజ్యసభకు ఎన్నిక‌య్యారు. దీంతో ఆయ‌న ఢిల్లీలో అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాజిందర్ నగర్ స్థానం ఖాళీ అయింది. దీంతో ఇక్క‌డ ప్ర‌స్తుతం ఉప ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. బీజేపీ రాజేష్ భాటియాను నిలబెట్టగా, కాంగ్రెస్ తన అభ్యర్థిగా ప్రేమ్ లతను ప్రకటించింది. మరోవైపు త‌మ పార్టీకే ఓట్లు అనుకూలంగా వస్తాయని ఆప్ అభ్యర్థి దుర్గేష్ పాఠక్ విశ్వాసం వ్యక్తం చేశారు.

త్రిపుర
త్రిపుర‌లో బోరోద్వాలి పట్టణం, అగర్తల, సుర్మా, జుబరాజ్‌నగర్ అనే నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. మాజీ స్పీకర్ రామేంద్ర చంద్ర దేబ్‌నాథ్ మరణంతో జుబారాజ్‌నగర్ స్థానం ఖాళీ కాగా, ముగ్గురు బీజేపీ శాసనసభ్యులు సుదీప్ రాయ్ బర్మన్, ఆశిష్ కుమార్, ఆశిష్ దాస్ లు కాంగ్రెస్ పార్టీ, తృణ‌ముల్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. దీంతో ఆ మూడు అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. 

ఉత్తర ప్రదేశ్
ఉత్తరప్రదేశ్‌లో రెండు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆజం ఖాన్ గెలుపొందడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ కర్హల్ అసెంబ్లీ సీటును గెలుచుకున్నారు. దీంతో ఆయ‌న అంత‌కు ముందు నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నఅజంగఢ్లో క్ స‌భ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఈ రెండు స్థానాల‌కు నేడు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్నారు. 

Ayodhya Kissing Wife : న‌దిలో భార్యను ముద్దుపెట్టుకున్న‌ భర్తను చితక్కొట్టిన జ‌నం.. VIDEO వైర‌ల్

ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూర్ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) కి చెందిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఈ స్థానం ఖాళీ అయింది. దీంతో ఇక్క‌డ ఎన్నిక‌లు చేప‌ట్ట‌నున్నారు. 

జార్ఖండ్
జార్ఖండ్ లో మందార్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి నేడు ఎన్నిక‌లు నిర్వ‌హించనున్నారు. 2019లో ఈ స్థానం నుంచి గెలుపొందిన బంధు టిర్కీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలారు. దీంతో ఆ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. ఇక్క‌డి నుంచి బంధు టిర్కీ కుమార్తె శిల్పి నేహా టిర్కీని కాంగ్రెస్ బరిలోకి దించగా.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే గంగోత్రి కుజుర్‌ను అభ్యర్థిగా ప్రకటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios