సుప్రీంకోర్టు కలుగజేసుకునే దాకా మౌనంగా ఉన్న ప్రధానిపై ‘ఇండియా’కు ఎలా నమ్మకం ఉంటుంది - కపిల్ సిబల్
సుప్రీంకోర్టు వ్యాఖ్యానించేదాకా మణిపూర్ అంశంపై మౌనంగా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీపై ‘ఇండియా’కు ఎలా నమ్మకం ఉంటుందని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ విమర్శించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఉదయం ట్వీట్ చేశారు.

రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ప్రధాని నరేంద్ర మోడీపై బుధవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మణిపూర్ విషయంలో పార్లమెంట్‌లో ప్రకటన చేసేంత విశ్వాసం లేనప్పుడు, ‘ఇండియా’కు ఎలా నమ్మకం ఉంటుందని అన్నారు. మణిపూర్ అంశం చర్చించే వ్యూహంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానానికి నోటీసు దాఖలు చేయడానికి కొంత సమయం ముందు ఆయన సిబల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు ఆయన ఉదయం ట్వీట్ చేశారు. అందులో ‘‘పార్లమెంటులో ప్రకటన చేయడానికి ప్రధానికి విశ్వాసం లేదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యానించే వరకు మణిపూర్ లో మహిళలపై జరుగుతున్న నేరాలపై ఆయన తన మౌనం ఉన్నారు. బ్రిజ్ భూషణ్ పై మౌనంగానే ఉన్నారు. ఏ భూభాగాన్ని చైనా ఆక్రమించలేదని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ‘ఇండియా’కు ఆదయనపై నమ్మకం ఎలా కలుగుతుంది’’ అని పేర్కొన్నారు.
కాగా.. పార్లమెంట్ లో ప్రతిపక్ష కూటమి ఇండియన్ (ఇండియన్ నేషనల్ డెవలప్ మెంట్ ఇన్ క్లూజివ్ అలయన్స్) ఎంపీలు మంగళవారం ఓ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మణిపూర్ అంశంపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడానికి, ప్రధానిని మాట్లాడించేలా చేయడానికి ఇది సమర్థవంతమైన మార్గమని ప్రతిపక్ష నేతలు నిర్ణయించారు.
ఈడీ, సీబీఐ, ఐటీలే ఎన్డీయేలో ఉన్న మూడు బలమైన పార్టీలు - ఉద్ధవ్ ఠాక్రే
అందులో భాగంగానే నరేంద్ర మోడీ ప్రభుత్వంపై లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ గౌరవ్ గోగోయ్ అవిశ్వాస తీర్మాన నోటీసు అందించారు. అంతకు ముందు తన పార్టీ ఎంపీలు అందరూ పార్లమెంట్ కు తప్పకుండా హాజరుకావాలని కాంగ్రెస్ విప్ జారీ చేసింది. కాగా.. మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన 140 కోట్ల మంది భారతీయులను అవమానించిందని, చట్టం తన పూర్తి శక్తితో పనిచేస్తుందని, దోషులెవరినీ వదిలిపెట్టబోమని ప్రధాని మోడీ గత గురువారం అన్నారు.