Asianet News TeluguAsianet News Telugu

బాలికపై ఆస్పత్రి సిబ్బంది గ్యాంగ్‌రేప్...కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరితే

ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఓ బాలికపై ఆ ఆస్పత్రి సిబ్బందే అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన బాలిక ఈ అఘాయిత్యం కారణంగా మరింత అనారోగ్యానికి గురయ్యింది. బాలికకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి మరీ ఇద్దరు కామాంధులు తమ కామ వాంఛ తీర్చుకున్నారు. ఈ దారుణం ఉత్తర ప్రదేశ్ లో జరిగింది.

hospital staff gang rapped on girl
Author
Baghpat, First Published Oct 17, 2018, 12:13 PM IST

ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఓ బాలికపై ఆ ఆస్పత్రి సిబ్బందే అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన బాలిక ఈ అఘాయిత్యం కారణంగా మరింత అనారోగ్యానికి గురయ్యింది. బాలికకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి మరీ ఇద్దరు కామాంధులు తమ కామ వాంఛ తీర్చుకున్నారు. ఈ దారుణం ఉత్తర ప్రదేశ్ లో జరిగింది.

యూపిలోని బాఘ్‌పట్ జిల్లా ఆస్పత్రి సిబ్బంది ఈ దారుణానికి పాల్పడ్డారు. ఓ బాలిక తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితిని గమనించిన డాక్టర్లు కొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాలని సూచించి అడ్మిట్ చేసుకున్నారు. దీంతో బాలికకు తోడుగా సోదరిని ఉంచి మిగిలిన వారు ఇంటికి వెళ్లిపోయారు.

ఈ బాలికపై ఇద్దరు ఆస్పత్రి కన్నేశారు. ఫార్మా ట్రెయినీతో పాటు ఓ వార్డు బాయ్ ఇద్దరు కలిసి బాలికను అనుభవించాలని పథకం వేశారు. రాత్రి సమయంలో ఇందుకోసం కాపుకాశారు. అయితే బాలికకు తోడుగా వున్న సోదరి టీ కోసం బైటికి వెళ్లింది. దీన్ని అదునుగా భావించిన ఇద్దరు మృగాళ్లు బాలికకు మత్తుమందు ఇచ్చారు. ఆమె మత్తులోకి జారుకున్నాక అతి దారుణంగా ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు.

బాలిక సోదరి వచ్చేసరికి నిందితులు ఇంకా బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నారు. దీన్ని గమనించిన ఆమె ఆస్పత్రిలోని మిగతా సిబ్బందికి ఈ విషయాన్ని చెప్పింది. దీంతో వారంతా కలిసి నిందితులిద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

బాధితురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆస్పత్రిలో సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.   

ఇతర వార్తలు

జూనియర్ ఆర్టిస్ట్‌పై గ్యాంగ్‌రేప్..నమ్మిన స్నేహితురాళ్లే ముంచారు

జాబ్స్‌పేరుతో 30 మంది యువతులపై రేప్: మస్తాన్ వలీ అరెస్ట్

Follow Us:
Download App:
  • android
  • ios