జూనియర్ ఆర్టిస్ట్‌పై గ్యాంగ్‌రేప్..నమ్మిన స్నేహితురాళ్లే ముంచారు

gangrape by junior artist in hyderabad
Highlights

డబ్బు విషయంలో వివాదం జరిగి దానిపై పగ పెంచుకున్న వ్యక్తి మరో ముగ్గురితో కలిసి ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గుంటూరుకు చెందిన శిరీష, హేమ లంగర్‌హౌస్‌లో ఉంటూ వీరి స్నేహితురాలు ఎల్లారెడ్డిగూడ హాస్టల్‌లో ఉంటోంది

డబ్బు విషయంలో వివాదం జరిగి దానిపై పగ పెంచుకున్న వ్యక్తి మరో ముగ్గురితో కలిసి ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గుంటూరుకు చెందిన శిరీష, హేమ లంగర్‌హౌస్‌లో ఉంటూ వీరి స్నేహితురాలు ఎల్లారెడ్డిగూడ హాస్టల్‌లో ఉంటోంది.. కొద్దికాలం క్రితం ఆ యువతికి రాజ్‌కిరణ్ అనే ఆర్టిస్ట్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో రాజ్‌కిరణ్ ఆమెను తనకు దగ్గర్లోని హాస్టల్‌లో చేర్చాడు.

అయితే సినిమాల్లో అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్న ఆర్టిస్టుల కోసం వీరిద్దరూ ‘‘మన’’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి.. సభ్యత్వం కోసం కొంత డబ్బు వసూలు చేశారు. ఈ డబ్బు లెక్కల్లో తేడాలు రావడంతో వారిద్దరి మధ్యా విభేదాలు తలెత్తాయి. దీనిని మనసులో పెట్టుకున్న రాజ్‌కిరణ్ పగబట్టాడు. ఈ ఏడాది మార్చి 5న సదరు యువతితో పాటు శిరీష, హేమలతో కలిసి గుంటూరు వెళ్లి.. అక్కడ లాడ్జిలో ఉన్నారు. ఈ సమయంలో శిరీష, హేమ ఆ యువతికి శీతలపానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చారు.

ఆమె స్పృహతప్పి పడిపోగానే రాజ్‌కిరణ్‌తో పాటు మరో ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. ఈ తతంగాన్ని వీడియో తీసి తాను చెప్పినట్లు వినకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.. తనకు అవకాశాలు తగ్గిపోతాయని ఆ యువతి మౌనంగా ఉండిపోయింది. అయితే రోజు రోజుకు రాజ్‌కిరణ్ వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు రాజ్‌కిరణ్‌పై కేసు నమోదుచేశారు. ఇతనిపై గతంలోనూ లంగర్‌హౌస్ పోలీస్  స్టేషన్‌లోనూ కేసు నమోదైంది.
 

loader