EXCLUSIVE : ఇస్రో తయారీ పరికరాన్ని నాసా ఇష్టపడింది.. తమకే ఇవ్వాలని కోరింది - చైర్మన్ సోమనాథ్

ప్రపంచంలోని అన్ని పరిశోధన సంస్థలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో మిషన్లు ప్రయోగించాలని తాము మొదటి నుంచి పాటిస్తున్న విధానం అని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. అందుకే దాదాపు అన్ని పరికరాలను తామే సొంతంగా తయారు చేసుకుంటున్నామని చెప్పారు.

EXCLUSIVE : NASA liked the device made by ISRO.. wanted to give it to them - Chairman Somnath..ISR

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తయారు చేసిన ఓ పరికరం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థకు నచ్చిందని, దానిని తమకే ఇవ్వాలని కోరిందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఆ పరికరాన్ని వాళ్లు చాలా ఇష్టపడ్డారని చెప్పారు. ‘ఏషియానెట్ న్యూస్ నెటవర్క్’ నిర్వహించే ప్రత్యేక ఎపిసోడ్ ‘డైలాగ్స్’ లో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. బెంగళూరులోని ఇస్రో యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ లో ఆయన ‘ఏషియానెట్ న్యూస్ నెట్ వర్క్’ తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంతరిక్ష పరిశోధన సంస్థలతో పోలిస్తే చాలా తక్కువతో ఇస్రో విజయవంతమైన మిషన్లు, ఉపగ్రహాలను తయారు చేస్తుందని ఆయన చెప్పారు. దాదాపు అన్నింటిని సొంతంగా తయారు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ‘‘ అతి తక్కువ ఖర్చు ప్రయోగాలు నిర్వహించాలనే సూత్రాన్ని మేము మొదటి నుంచి అవలంభిస్తున్నాం. ఇందులో మొదటిది మోడల్స్. ఏదైనా ఒక మోడల్ లోకి రావాలంటే ముందుంగా ప్రోటోటైపింగ్ లో పెట్టుబడి పెట్టాలి. ఇది బహుళ స్థాయిలలో జరుగుతుంది. అందుకే మన డిజైన్లు చాలావరకు అవుట్ సోర్సింగ్ కాకుండా.. సొంతంగా తయారు చేసుకుంటాం.’’ అని ఆయన తెలిపారు.

‘‘వాస్తవానికి మేము ఎలాంటి డిజైన్ ను అయినా అవుట్సోర్సింగ్ చేయకూడదనే పద్దతిని సృష్టించుకున్నాం. గ్రౌండ్ డిజైన్ కూడా మేమే చేస్తాం’’ అని సోమనాథ్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సందర్భంగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా..ఇస్రో అభివృద్ధి చేసిన పరికరాల్లో ఒకదాన్ని తమ వద్దే ఉంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించిన ఓ విచిత్రమైన ఘటనను ఇస్రో చైర్మన్ ఉదహరించారు. 

‘‘ఈ ఫిక్సర్ లో (ఒక పరికరం వైపు చూపిస్తూ) ఉన్న ప్రతిదీ కూడా మనమే సొంతంగా తయారు చేసుకున్నాం. ఇది చూసేందుకు చాలా సింపుల్ గా ఉంటాయి. అయితే నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ అనే ఓ ఉపగ్రహాన్ని అసెంబుల్ చేస్తున్నాం. అందులో భాగంగా మేము ఓ పరికరాన్నిఇటీవల యూఎస్ కు పంపించాం. అయితే ఆ పేలోడ్ నిర్మాణాన్ని వారు చాలా ఇష్టపడ్డారు. దానిని అక్కడే ఉంచాలని వారు కోరారు. తీసుకెళ్లొద్దని తమ వద్దే ఉంచుకుంటామని చెప్పారు. ’’ అని ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios