Asianet News TeluguAsianet News Telugu

ఘోరం.. 70 ఏళ్ల వృద్ధుడిని ఢీకొట్టి 8 కిలో మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. బాధితుడు మృతి..

దేశ రాజధానిలోని కంఝవాలాలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గుర్తుకు తెచ్చే ఘటన ఒకటి బీహార్ లో జరిగింది. రోడ్డు దాటుతున్న 70 ఏళ్ల వృద్ధుడిని కారు ఢీకొట్టి 8 కిలో మీటర్లు ఈడ్చుకెళ్లింది. దీంతో ఆయన చనిపోయారు. 

Horrific.. A car hit a 70-year-old man and dragged him for 8 km.. The victim died..
Author
First Published Jan 22, 2023, 2:33 PM IST

దేశ రాజధాని ఢిల్లీలోని కంఝవాలాలో భయానక ఘటన మరవకముందే పలు రాష్ట్రాల్లో ఇలాంటి తరహా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఇటీవల ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. తాజాగా బీహార్ లో ఈ తరహా యాక్సిడెంట్ ఒకటి చోటు చేసుకుంది. ఓ వృద్ధుడిని కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో అతడు బానెట్ పై పడ్డాడు. అయినా కారు ఆగకుండా అలాగే 8 కిలో మీటర్లు అతడిని ఈడ్చుకెళ్లాడు. దీంతో బాధితుడు మరణించాడు.

జ్యూడీషియరీ వర్సెస్ కేంద్రం: ఏది సవ్యమైనదంటే.. కేంద్ర న్యాయ శాఖ మంత్రి లేటెస్ట్ కామెంట్ ఇదే

బీహార్ లోని తూర్పు చంపారన్ పరిసర ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బంగార గ్రామంలో 70 ఏళ్ల శంకర్ చౌదరి నివసిస్తున్నాడు. ఆయన శుక్రవారం తన సైకిల్ పై నేషనల్ హైవే నెంబర్ 28 లో కోటవా సమీపంలోని బంగార రహదారిని దాటుతున్నాడు. ఈ సమయంలో అటు నుంచి వేగంగా ఓ కారు వచ్చింది. సైకిల్ ను ఢీకొట్టింది. దీంతో ఆయన కారు బ్యానెట్ పై పడ్డాడు. అయినా డ్రైవర్ కారును ఆపలేదు. కారు ఆపాలని వృద్ధుడు అతడిని ఎంత వేడుకున్నా వినలేదు. బాధితుడి మాట వినకుండా కారు అలాగే పోనిచ్చాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్టు ‘టైమ్స్ నౌ’ నివేదించింది.

పఠాన్ సినిమాపై ఆందోళనలు:అసోం సీఎం బిశ్వశర్మకు బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ ఫోన్

కాని అతను కారును నడపడం కొనసాగించాడు. అలాగే 8 కిలో మీటర్లు ప్రయాణించాడు. బాధితుడు బిక్కుబిక్కుమంటూ అలాగే దానిని బ్యానెట్ ను పట్టుకొని ఉన్నాడు. దీనిని గమనించిన స్థానికులు బైక్ పై కారును వెంబడించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ ఘటనలో వృద్ధుడు మరణించాడు. దీనిపై కోటవా పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకున్నారు. 

భారత్ శ్రీలంకకు అండగా ఉంటుంది - విదేశాంగ మంత్రి జైశంకర్

ఈ ప్రమాదానికి కారణమైన కారు మోతీహరి ప్రాంతానికి చెందిన ఓ డాక్టర్ ది అని పోలీసులు గుర్తించారు. కారు నడిపిన వ్యక్తిని గుర్తించేందుకు ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను పోలీసులు పరిశీలించారు. మరోవైపు ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని సర్కిల్ అధికారి నిరంజన్ కుమార్ మిశ్రా నిరసనకారులకు హామీ ఇవ్వడంతో పరిస్థితి పరిస్థితి సద్దుమణిగింది. కాగా.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మోతిహారి సదర్ హాస్పిటల్ కు తరలించామని పోలీసులు తెలిపారు. కారును జప్తు చేశామని పేర్కొన్నారు. 

తెలంగాణకు మరో మూడు వందే భారత్ రైళ్లు.. మూడు కీలక నగరాలకు తగ్గనున్న ప్రయాణ సమయం

ఈ ఘటన ఢిల్లీ కంఝవాలాలో జరిగిన ప్రమాదాన్ని గుర్తుకుతెచ్చింది. జనవరి 1 తెల్లవారుజామున 20 ఏళ్ల అంజలి సింగ్ అనే మహిళ ఓ కారు వేగంగా ఢీకొట్టింది. ఆమెను సుమారు 12 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. తీవ్రగాయాలతో బాధితురాలు మరణించారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios