తెలంగాణకు మరో మూడు వందే భారత్ రైళ్లు.. మూడు కీలక నగరాలకు తగ్గనున్న ప్రయాణ సమయం
తెలంగాణకు మరో మూడు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు రానున్నాయి. వచ్చే కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో ఈ కేటాయింపులకు సంబంధించిన ప్రకటన వెలువడనుంది. మొత్తంగా ఈ ఏడాది 300-400 వందే భారత్ రైళ్లను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణకు మరో మూడు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. వచ్చే కేంద్ర బడ్జెట్ లో ఈ మేరకు ప్రకటన చేయనున్నారు. కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు హైదరాబాద్‌లోని కాచిగూడ-బెంగళూరు, సికింద్రాబాద్-పూణే, సికింద్రాబాద్- తిరుపతి మధ్య ప్రయాణించనున్నాయి. ఈ మార్గాల్లో రైళ్లు గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయని అధికారులు అంచనా వేశారు. దీంతో ఈ నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది.
అమ్మాయి వద్దంటే వద్దనే అర్థం.. వారి అనుమతి లేకుండా తాకకూడదని అబ్బాయిలకు నేర్పండి: కేరళ హైకోర్టు
సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ డివిజన్లలో వందే భారత్ రైళ్ల కోచ్ డిపోలు కూడా ఉన్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాల ప్రకారం.. రాబోయే యూనియన్ బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా 300-400 కొత్త సెమీ హై-స్పీడ్ వందే భారత్ రైళ్లను ప్రకటించే అవకాశం ఉందని ‘టైమ్స్ నౌ’ కథనం నివేదించింది. ఇందులో కనీసం 75 రూట్లను ఈ ఏడాదిలోనే ప్రారంభించనున్నారు.
భారత్ శ్రీలంకకు అండగా ఉంటుంది - విదేశాంగ మంత్రి జైశంకర్
ప్రస్తుతం వందే భారత్ రైళ్లు నాగ్‌పూర్-బిలాస్‌పూర్, ఢిల్లీ-వారణాసి, గాంధీనగర్-ముంబై, సికింద్రాబాద్-వైజాగ్, చెన్నై-మైసూరుతో పాటు పలు మార్గాల్లో నడుస్తున్నాయి. జనవరి 14వ తేదీన సికింద్రాబాద్-వైజాగ్ సర్వీస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రారంభించిన ఏడు వందేభారత్ రైళ్లు మొత్తం 23 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాయని, ఇది 58 రౌండ్ల భూమికి సమానమని చెప్పారు.
ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ జిల్లాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.8గా నమోదు..
‘‘ఆధారపడే మనస్తత్వం నుంచి బయటపడి ఆత్మనిర్భరత (స్వావలంబన) దిశగా పయనిస్తున్న భారతదేశానికి వందే భారత్ నిజమైన ప్రతిరూపం. వందే భారత్ నవ భారత సామర్థ్యానికి, సంకల్పానికి ప్రతీక. వేగవంతమైన అభివృద్ధి మార్గాన్ని ఎంచుకున్న భారతదేశానికి ఇది చిహ్నం. ప్రతిదీ ఉత్తమంగా ఉండాలని ఆశించే భారతదేశానికి ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రతీక. దేశంలోని ప్రతీ పౌరుడికి మెరుగైన సేవలు అందించాలని కోరుకునే భారతదేశానికి ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రతిరూపం’’ అని ప్రధాని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే సికింద్రాబాద్ - విశాఖపట్నం వందే భారత్ రైలు ప్రారంభమైనప్పటి నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోంది. ఇది రెండు నగరాల మధ్య దూరాన్ని ఎనిమిదిన్నర గంటల్లో చేరుకుంటోంది. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్‌ను విశాఖపట్నంతో కలుపుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే ఈ రైలు 700 కిలో మీటర్లు దూరం ప్రయాణించే మొదటి రైలు. ఈ రైలు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ స్టేషన్లలో, తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగుతుంది.