Asianet News TeluguAsianet News Telugu

ఘోరం.. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలన్నందుకు వృద్ధుడిని చితకబాది, మూత్రం పోసిన పక్కింటి వ్యక్తి..

ఇటీవల కాలంలో మనుషులపై మూత్ర విసర్జన చేసిన ఘటనలు ఎక్కువవుతున్నాయి. విమానంలో, రైలులో, బస్సులో ప్రయాణికులపై పలువురు మూత్రం పోశారని ఈ మధ్య వార్తలు వచ్చాయి. తాజాగా యూపీలోని ఆగ్రాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 

Horrible.. Neighbor who crushed an old man and poured urine on him to return the borrowed money..ISR
Author
First Published May 12, 2023, 7:59 AM IST


అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినందుకు ఓ వృద్ధుడికి ఘోర అనుభవం ఎదురైంది. డబ్బులు తిరిగి ఇవ్వకపోగా ముసలాయనపై దాడి చేసి, మూత్రం పోశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జరిగింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

దారుణం.. ఇంటి నుంచి ఎత్తుకెళ్లి 13 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రాలో నివసించే 76 సంవత్సరాల ఛత్తర్ సింగ్ కుష్వాహా.. తన ఇంటికి సమీపంలో ఉండే ఓ వ్యక్తికి రూ.14 వేలు ఇచ్చాడు. అతడి పేరు మూల్ చంద్. ఆ డబ్బులను ఏప్రిల్ 30వ తేదీన అప్పుగా కుష్వాహా నుంచి తీసుకున్నాడు. అయితే డబ్బులు తీసుకొని 10 రోజులు దాటడంతో వృద్ధుడు మూల్ చంద్ ఇంటికి వెళ్లాడు. తన అప్పు డబ్బులు తిరిగి ఇచ్చేయాలని కోరాడు.

కేదార్ నాథ్ యాత్రలో తప్పిపోయిన ఏపీకి చెందిన వృద్ధురాలు.. గూగుల్ ట్రాన్స్ లేట్ సాయంతో కుటుంబ సభ్యుల వద్దకు..

దీంతో అతడు ఆగ్రహానికి లోనయ్యాడు. డబ్బులు ఇవ్వబోనని తేల్చిచెప్పాడు. తన కొడుకుతో కలిసి కుష్వాహాపై దాడి చేశాడు. తీవ్రంగా చితకబాదాడు. అంతటితో ఊరుకోకుండా.. వృద్ధుడిపై నిందితుడి కుమారుడు మూత్ర విసర్జన చేశాడు. దీంతో బాధితుడికి గాయాలు అయ్యాయి. తనపై జరిగిన దాడిని వివరిస్తూ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన ఘటనంతా పోలీసులకు చెప్పాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదేం సరదా.. వ్యక్తి ప్రైవేట్ పార్ట్స్ లో కంప్రెషర్ పంపుతో గాలి కొట్టిన స్నేహితుడు.. తరువాత ఏం జరిగిందంటే ?

ఇటీవల లక్నోలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. తాగిన మత్తులో ఓ రైల్వే టీటీఈ  ఓ ప్రయాణికురాలి మీద మూత్రవిసర్జన చేశాడు. ఈ ఘటన గత ఆదివారం రాత్రి అకల్ తఖ్త్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. అమృత్‌సర్‌కు చెందిన ఆ మహిళ తన భర్త రాజేష్ కుమార్‌తో కలిసి ప్రయాణిస్తోంది. అమృత్‌సర్‌ నుంచి కోల్‌కతా వెళ్తున్న అకల్‌ తఖ్త్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏ1 కోచ్‌లో ఇది చోటు చేసుకుంది. ఈ హఠాత్ పరిణామానికి మహిళ లేచి.. గట్టిగా కేకలు వేయడంలో చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులు విని.. మద్యం మత్తులో ఉన్న టీటీఈని పట్టుకున్నారు, అతన్ని బీహార్‌కు చెందిన మున్నా కుమార్‌గా గుర్తించారు. రైలు సోమవారం లక్నోలోని చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే టీటీఈని జీఆర్‌పీకి అప్పగించారు.

Follow Us:
Download App:
  • android
  • ios