Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. ఇంటి నుంచి ఎత్తుకెళ్లి 13 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం..

ఇంటి నుంచి ఎత్తుకెళ్లి 13 ఏళ్ల దళిత బాలికపై ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీ జిల్లాలో జరిగింది. తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 

Atrocious.. A 13-year-old Dalit girl was taken from home and gang-raped..ISR
Author
First Published May 12, 2023, 6:59 AM IST

బాలికలకు రక్షణ లేకుండా పోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులకు భయం వేయడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు వెలుగులో వస్తూనే ఉన్నాయి. చిన్నారులు, ముసలివాళ్లు అని కూడా చూడకుండా మగాళ్లు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. దివ్యాంగులు అని జాలి కూడా చూపకుండా అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. తాజాగా యూపీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 13 ఏళ్ల దళిత బాలికపై ఇద్దరు వ్యక్తులు దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

కేదార్ నాథ్ యాత్రలో తప్పిపోయిన ఏపీకి చెందిన వృద్ధురాలు.. గూగుల్ ట్రాన్స్ లేట్ సాయంతో కుటుంబ సభ్యుల వద్దకు..

అమేథీ పోలీస్ సూపరింటెండెంట్ ఎలమారన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమేథీ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఓ గ్రామంలో ఓ దళిత కుటుంబం నివసిస్తోంది. అయితే బుధవారం రాత్రి ఆ కుటుంబంలోని 13 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల వారిస్, ఇంకో వ్యక్తి కలిసి ఎత్తుకెళ్లారు. అనంతరం ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.

గోల్డెన్ టెంపుల్ సమీపంలో మళ్లీ బాంబు పేలుడు.. వారం రోజుల్లో మూడో ఘటన

బాలికను రాత్రంతా వారితో ఉంచుకొని గురువారం ఉదయం ఇంటికి పంపించారు. ఏం జరిగిందని బాధితురాలి తండ్రి ఆరా తీస్తే.. తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించింది. దీంతో తండ్రి పోలీసులను ఆశ్రయించారు. తమ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తన కూతురుపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మూడేళ్ల కూతురిని కాపాడేందుకు చిరుతపులితోనే పోరాడిన దంపతులు.. ఎక్కడంటే ? 

దీంతో పోలీసులు ఆ ఇద్దరు నిందితులపై భారతీయ శిక్షాస్మృతి, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద నిందితులపై స్థానిక మోహన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios