జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35-ఏలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా జమ్మూ కశ్మీర్ ని కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే... కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

కాగా... ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే సొంత పార్టీకి షాకిచ్చింది. కశ్మీర్‌ అంశంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. అదేవిధంగా హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశ సమైక్యతకు తామంతా కట్టుబడి ఉంటాం  జై హింద్ అంటూ ట్వీట్ చేశారు.

ఓ వైపు కాంగ్రెస్ పార్టీ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే.. పార్టీకి వ్యతిరేకంగా ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. అధితి సింగ్‌ పోస్ట్‌పై కాంగ్రెస్‌ అధిష్టానం ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి యూపీయే చైర్‌పర్సన్‌ ఎంపీగా గెలుపొందిన విషయం గమన్హారం. 

ఆమెతో పాటు యూపీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జనార్థన్‌ ద్వివేది కూడా కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించారు. వీరితో పాటు మరికొంత మంది హస్తం నేతలు కూడా ఆర్టికల్‌ 370 రద్దును సమర్థిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుపై తమ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యసభలో కాంగ్రెస్‌ విప్‌ భువనేశ్వర్ కలిత రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీకి కూడా ఆయన రాజీనామా చేశారు.

related news

రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం: జమ్మూ కాశ్మీర్‌ విభజనపై రాహుల్

కాశ్మీర్ విభజన: ఎపి విభజనపై కాంగ్రెస్ కు అమిత్ షా చురకలు

ఆక్రమిత కాశ్మీర్ పై అమిత్ షా సంచలన ప్రకటన

లోక్‌సభలో కాశ్మీర్ విభజన బిల్లు ప్రవేశపెట్టిన అమిత్ షా