హిందూమత గ్రంథాలు ‘అశ్లీల గ్రంథాలు’ అని బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ప్రతిపక్ష నాయకుడు తారిఖ్ రెహమాన్ అన్నారు. అవి ఎలాంటి నైతిక బోధనలనూ అందించవని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

బంగ్లాదేశ్ ప్రతిపక్ష నాయకుడు తారిఖ్ రెహమాన్ హిందూ మత గ్రంథాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందు మత గ్రంథాలను ‘అశ్లీల గ్రంథాలు’గా పేర్కొంటూ అవమానకరంగా మాట్లాడారు. హిందూ గ్రంథాలు ఎలాంటి నైతిక బోధనలనూ అందించవని తెలిపారు. ఈ మేరకు ఆయన ఫేస్ బుక్ లైవ్ లో భారీ వివాదానికి దారితీసేలా మాట్లాడారు. 

భార‌త్ జోడో యాత్ర‌కు రండి... కాంగ్రెస్ ఆహ్వానంపై పార్టీలో చ‌ర్చిస్తామ‌న్న అఖిలేష్ యాద‌వ్

తారిఖ్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ గోనో ఒధికార్ పరిషత్ జాయింట్ కన్వీనర్ గా ఉన్నాడు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్‌లో ప్రస్తుత షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దె దించాలని చూస్తున్న ప్రతిపక్ష ముఖ్య నాయకుడైన నూరుల్ హక్ నూర్‌కు రెహమాన్ సన్నిహితుడు.

‘‘హిందూ మత గ్రంథాలు ఎలాంటి నైతిక బోధననూ అందించవు. అన్ని మత గ్రంథాలు అశ్లీల స్క్రిప్ట్‌లు’’అని ఆయన లైవ్ టెలికాస్ట్‌లో చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చాలా మంది షేర్లు చేస్తున్నారు. కాగా.. 2021 అక్టోబరులో ప్రారంభించిన గోనో ఓధికార్ పరిషత్‌లో ఎక్కువ కార్యకర్తలు, నాయకులుగా ఎక్కువగా యువతే ఉన్నారు. ఆ పార్టీకి తీవ్రవాద సంస్థ జమాతే ఇస్లామీ మద్దతు ఉన్నట్లు సమాచారం.

ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయంపై ఖలిస్తాన్ మద్దతుదారుల దాడి..

బంగ్లాదేశ్ లో హిందువులపై విషం చిమ్మేందుకు ప్రయత్నిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలను అనేక మంది ఖండిస్తున్నారు. త్వరలోనే బంగ్లాదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందూమతంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే సౌదీ అరేబియా నుంచి టెలికాస్ట్ అయిన ఈ ఫేస్ బుక్ లైవ్ లో.. ఎన్నికలు నిర్వహించకుండా అధికారాన్ని పొందేందుకు బ్యాక్ డోర్ కార్యకలాపాలకు పాల్పడుతున్నానని ఆయన బహిరంగంగానే వెల్లడించారు. జర్నలిస్టులను బానిసలుగా అభివర్ణించాడు. తన మిషన్ ను ప్రశ్నించవద్దని ఆయన పాత్రికేయులకు ఈ లైవ్ లో సూచించాడు. 

‘‘ అవును. నేను మొస్సాద్ తో పాటు విదేశీ నిఘా సంస్థలతో కలిసి కుట్రకు పాల్పడ్డాను. ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నంలో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర పన్నడానికి నేను మొస్సాద్ ఏజెంట్ మెండి ఎన్ సఫాదీతో సమావేశం నిర్వహించాను.’’ అని అన్నారు. కాగా.. షేక్ హసీనా లౌకిక అనుకూల వైఖరికి ప్రతిస్పందనగా అతడి సంస్థ హిందువులు, భారతదేశంపై పరువు నష్టం కలిగించే దాడులను ప్రారంభించింది.

విమానంలో కాబోయే భార్యకు ప్రపోజ్ చేసిన యువకుడు.. వీడియో వైరల్...!

బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరగడం కొత్తేమీ కాదు. ఇటీవలి గణాంకాల ప్రకారం 2022 లో దేశంలో ప్రధానంగా హిందువులతో పాటు 154 మంది మత మైనారిటీ సభ్యులు హత్యకు గురయ్యారు. బంగ్లాదేశ్ నేషనల్ హిందూ గ్రాండ్ అలయన్స్ ప్రకారం.. మైనారిటీ జాతులకు చెందిన 39 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు (వారిలో 27 మంది సామూహిక అత్యాచారానికి గురయ్యారు). అత్యాచార బాధితుల్లో 14 మంది మరణించారు. మొత్తంగా 195991 కుటుంబాలు అభద్రతా భావాన్ని ఎదుర్కొంటున్నాయని ‘ఓపీ ఇండియా’ కథనం నివేదించింది.