New Delhi: జనవరి 30న భారత్ జోడో యాత్ర జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ కు చేరుకోనుంది. ఈ క్రమంలోనే అక్కడ భారీ బహిరంగా సభను నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా ఈ సభలో పాలుపంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ అనేక రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. వారిలో యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా ఉన్నారు.
Bharat Jodo Yatra: జనవరి 30న జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో జరగనున్న భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం 21 ఎన్డీయేతర పార్టీలను ఆహ్వానించారు. అక్కడ భారీ బహిరంగా సభను నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా ఈ సభలో పాలుపంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ అనేక రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. వారిలో యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా ఉన్నారు. అయితే, కాంగ్రెస్ ఆహ్వానంపై స్పందించిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. ఈ విషయంపై పార్టీతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. జనవరి 30 న శ్రీనగర్‌లో జరిగే పార్టీ భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆహ్వానంపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గురువారం మాట్లాడారు. కాంగ్రెస్ ఆహ్వానంపై తమ పార్టీతో చర్చించి, హాజరవుతారో లేదో నిర్ణయిస్తామని ఎస్పీ చీఫ్ చెప్పారు. “కాంగ్రెస్ ఆహ్వానం వచ్చింది. పార్టీతో చర్చించి నిర్ణయం తీసుకుంటాను' అని అఖిలేష్ గురువారం విలేకరుల సమావేశంలో అన్నారు.
కాగా, సమాజ్ వాదీ పార్టీ వంటి ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ వంటి జాతీయ భావజాలాన్ని అందించలేవని పునరుద్ఘాటించినప్పటికీ బీజేపీయేతర పార్టీలను సౌకర్యవంతంగా, గౌరవంగా భావించాల్సిన అవసరం ఉందని రాహుల్ నొక్కిచెప్పిన కొద్ది రోజుల తరువాత అఖిలేష్ యాదవ్ కు భారత్ జోడో యాత్రలో పాలుపంచుకోవాలని ఆహ్వానం అందడం గమనార్హం. ఉత్తరప్రదేశ్ లో భారత్ జోడో యాత్రలో ఎస్పీకి చెందిన అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి వంటి నేతలు పాల్గొనకపోవడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆహ్వానిత జాబితాలో బీఎస్సీ అధినేత్రి మాయావతి కూడా ఉన్నారు.
జనవరి 30న జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో జరగనున్న భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం 21 ఎన్డీయేతర పార్టీలను ఆహ్వానించారు. ఈ క్రమంలోనే మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో మేము ద్వేషం, హింసతో పోరాడటానికి, సత్యం, కరుణ-అహింస సందేశాన్ని వ్యాప్తి చేయడానికి-అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం-న్యాయం వంటి రాజ్యాంగ విలువలను రక్షించడానికి కట్టుబడి ఉంటాము. ప్రజాసమస్యల నుంచి ప్రజల దృష్టిని క్రమబద్ధంగా మళ్లించే మన దేశంలో సంక్షోభ సమయంలో ఈ యాత్ర ఒక శక్తివంతమైన గొంతుకగా ఆవిర్భవించింది. మీరు పాల్గొని దాని సందేశాన్ని మరింత బలపరుస్తారని నేను ఆశిస్తున్నాను" అని ఖర్గే ప్రతిపక్ష పార్టీ ముఖ్యులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
అయితే "శ్రీనగర్ యాత్రకు ఐదు రాజకీయ పార్టీలను ఆహ్వానించలేదు. వాటిలో ఏఐడీఎంకే, వైసీపీ, బీజేడీ, ఎంఐఎం, ఏఐయూడీఎఫ్ ఉన్నాయి. ఈ పార్టీలు కాంగ్రెస్ కు గట్టి ప్రత్యర్థులుగా.. బీజేపీతో తెరవెనుక సన్నిహితంగా.. మౌన అవగాహన కలిగి ఉన్నాయి. మేము వాటిని భావసారూప్య పార్టీలుగా పరిగణించము" అని ఆ నాయకుడు పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను ఆహ్వానించినప్పటికీ కాంగ్రెస్ సీనియర్ నేత, డెమొక్రాటిక్ ఆజాద్ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ ను ఆహ్వానించలేదు. ఆజాద్ పార్టీకి ఎలాంటి ప్రాముఖ్యత లేదని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. తన పార్టీకి చెందిన 17 మంది సీనియర్ నాయకులు తిరిగి కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమానికి అతన్ని ఆహ్వానించడానికి మాకు ఎటువంటి కారణం కనిపించలేదని తెలిపారు.
