హిజ్రాను కత్తితో బెదిరించి కిడ్నాప్, మత్తుమందిచ్చి లైంగిక దాడి.. ఇద్దరు అరెస్ట్..
తమిళనాడులో ఓ హిజ్రాను ఇద్దరు యువకులు బెదిరించి కిడ్నాప్ చేశారు. ఆ తరువాత మత్తుమందిచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు.

తమిళనాడు : తమిళనాడులో ఓ అమానవీయ ఘటన వెలుగు చూసింది. మత్తు మాత్రలు మింగించి ఓ హిజ్రాపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ ఇద్దరు నేరస్థులను పోలీసులు అరెస్టు చేశారు. జన్నీ, బ్లసికాలు చెన్నైపెరంబురు ప్రాంతానికి చెందిన హిజ్రాలు. సోమవారం రాత్రి వీరిద్దరూ చెన్నై మధురవాయిలు హైవే రోడ్డు జీసస్ కాల్స్ దగ్గర నిలబడ్డారు.
ఆ సమయంలో అక్కడికి ఇద్దరు వ్యక్తులు ఆటోలో వచ్చారు. వారిద్దరూ మద్యం మత్తులో ఉన్నారు. కాసేపు బ్లస్సికాతో మాట్లాడిన తర్వాత.. హఠాత్తుగా కత్తి చూపెట్టారు. బెదిరించి బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. పక్కనే ఉండి ఇది చూసిన జన్నీ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది.
మధురవాయిలు పోలీసులకు బ్లెసికాను ఎవరో ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేసింది.వెంటనే జెన్నీ ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఇన్స్పెక్టర్ సుబ్రమణి సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా సెట్టీయార్ అగరం ప్రాంతంలో బ్లెసికా ఉన్నట్లుగా గుర్తించారు. వారు అక్కడికి వెళ్లేసరికి బ్లేసికాకు మత్తుమందు ఇచ్చారు.
జగన్, దినేష్ అనే ఇద్దరు మందుబాబులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. జగన్ ఆవడికి చెందిన వ్యక్తి, కాగా, దినేష్ రామాపురానికి చెందిన వ్యక్తి. వీరిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారిచెరలో ఉన్న బ్లసీకాను విడిపించారు. మద్యం మత్తులో ఉన్న వారిద్దరూ సబ్ ఇన్స్పెక్టర్ మీద కూడా దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిద్దరిని తప్పించుకోకుండా పట్టుకుని అరెస్టు చేశారు. మత్తులో ఉన్న బ్లెసికాను చికిత్స కోసం కీలుపాక్కం ఆసుపత్రికి తరలించారు.