Asianet News TeluguAsianet News Telugu

మోడీకి జన్మనివ్వడమే ఆమె చేసిన తప్పు.. ప్రధాని తల్లిని ఎగతాళి చేసినందుకు ఆప్ పై తీవ్రంగా విరుచుకుపడిన బీజేపీ

ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబాపై ఆప్ గుజరాత్ చీఫ్ ఇటాలియా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బీజేపీ నాయకులు ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 

Her mistake was to give birth to Modi.. BJP has hit out at AAP for making fun of the Prime Minister's mother.
Author
First Published Oct 14, 2022, 3:55 PM IST

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియా ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబాను అవహేళన చేసిన పాత వీడియో మళ్లీ బయటకు రావడంతో ఆయనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హీరాబాపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇటాలియాపై విరుచుకుపడింది. 'కులతత్వ' వ్యాఖ్యలను మళ్లీ ప్రధాని మోడీపై ఉపయోగించినందుకు ఇటాలియాపై ఇప్పటికే పార్టీ కొరడా ఝులిపించింది.

నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు, షెడ్యూల్ ఇదే.. 80 ఏళ్లు నిండితే ఇంటి నుంచే ఓటు

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఇతర బీజేపీ నేతలు ఇటాలియాను దూషిస్తూ వీడియోను షేర్ చేశారు. రాబోయే గుజరాత్ ఎన్నికల్లో ఆ పార్టీ రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరానీ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ప్రధాని తల్లిని దుర్భాషలాడడం వల్ల గుజరాత్‌లో రాజకీయంగా ప్రజాదరణ పొందవచ్చని మీరు అనుకుంటే పొరబడినట్టే. ఆ తప్పుకు గుజరాత్‌,  రాష్ట్ర ప్రజలు రానున్న ఎన్నికల్లో మూల్యం చెల్లించుకునేలా చేస్తారు’’ అని అన్నారు.

అరవింద్ కేజ్రీవాల్ సూచనల మేరకే ఇటాలియా ఈ వ్యాఖ్యలు చేశారని, రాజకీయాలతో సంబంధం లేని 100 ఏళ్ల వృద్ధురాలిని ఆప్ నేతలు దుర్భాషలాడితే అది పూర్తిగా క్షమించరాని విషయం అని ఆమె తీవ్రంతా ధ్వజమెత్తారు. ‘‘ఆమె రాజకీయాల్లో ఉండకపోవడం నేరం కాదు. కానీ ఆమె మీ (కేజ్రీవాల్) రాజకీయ నాయకులను అడ్డుకునే నరేంద్ర మోడీకి జన్మనిచ్చింది. అదే ఆమె చేసిన ఏకైక నేరం ’’అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా.. గురువారం కూడా ట్విట్టర్ లో ఇరానీ ఇటాలియా వీడియో షేర్ చేస్తూ.. ‘‘ అరవింద్ కేజ్రీవాల్, గట్టర్ మౌత్ గోపాల్ ఇటాలియా ఇప్పుడు మీ ఆశీర్వాదంతో హీరా బాను దుర్భాషలాడారు. నేను ఆగ్రహాన్ని ఇష్టపడను. గుజరాతీలు ఎంత కోపంగా ఉన్నారో నేను చూపించదలచుకోలేదు, గుజరాత్‌లో ఎన్నికలలో మీ పార్టీని నాశనం చేస్తారు. ఇప్పుడు ప్రజలే న్యాయం చేస్తారు’’అని ఆమె ట్వీట్ చేశారు.

ఆ మఠాధిపతిపై మాపైనా లైంగికదాడులు చేశాడు.. నలుగురు మైనర్ బాలికల ఆరోపణలు.. కేసు నమోదు

గోపాల్ ఇటాలియా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అందులో అతడు పీఎం మోడీ, ఆయన తల్లిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వార్తల్లో నిలిచారు. ప్రధాని తల్లిని గోపాల్ ఇటాలియా జిమ్మిక్కుగా అభివర్ణించారు. ఈ వీడియోను బీజేపీ నేత అమిత్ మాల్వియా సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా ఈ వీడియో పాతదేనని చెబుతున్నారు.

జూమ్ కు ఘన నివాళి అర్పించిన ఇండియన్ ఆర్మీ.. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు (వీడియో)

అయితే ఈ వీడియో వైరల్ అవడంతో జాతీయ మహిళా కమిషన్ చైర్‌ పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సమాధానం ఇవ్వాలని ఆయనకు మహిళా కమిషన్ సమన్లు పంపించింది. అలాగే ఢిల్లీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సరితా విహార్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. కొన్ని రోజుల తరువాత ఇటాలియా విడులయ్యారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ తనతో అసభ్యంగా మాట్లాడిందని ఆరోపించారు. పలు విమర్శలు చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios