మహారాష్ట్రలోని ముంబై నగరంలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలో వరదలు వస్తున్నాయి. రహదారులన్ని  వర్షపు నీటితో ఉదృతంగా ప్రవహిస్తూ నగరంలో నదులు ప్రవహిస్తున్నాయా అన్న భ్రమను కల్గిస్తున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి మరీ ఘోరంగా తయారయ్యింది. ఇక్కడ వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి అక్కడినుండి సురక్షిత ప్రాంతాలకు తరలించి, పునరావాసం కల్పించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరో 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ముంబైలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అలాగే రోడ్లపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వరదల కారణంగా  పలు రైళ్లను రైల్వే శాఖ రద్దుచచేసింది. రైలు పట్టాలపై నీరు చేరి అతి ప్రమాదకరంగా మారడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.  

"