సారాంశం

ఉత్తరప్రదేశ్ లో ఓ స్కూల్ హెడ్మాస్టర్ తప్పతాగి పాఠశాలకు వచ్చాడు. ఆ తరువాత క్లాస్ రూంలోకి వెళ్లి.. దుస్తులు విప్పేసి, నగ్నంగా విద్యార్థుల ముందే పడుకుని నిద్రపోయాడు. 

ఉత్తర్ ప్రదేశ్ : ప్రధానోపాధ్యాయుడు అంటే మిగతా ఉపాధ్యాయులకు,  స్కూల్ లోని విద్యార్థులకు.. వారి తల్లిదండ్రులకు తన ప్రవర్తనతో ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి.  అలాంటి గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ ఓ ప్రధానోపాధ్యాయుడు బాధ్యత తప్పి వ్యవహరించాడు. స్కూల్ కి తప్పతాగి, ఒంటిమీద సోయి లేకుండా  వచ్చాడు. ఆ తరువాత  తరగతి గదిలోనే.. మద్యం మత్తులో.. ఒంటిపై ఏ మాత్రం సోయి, సుద్దు లేకుండా  నగ్నంగా నిద్రపోయాడు.

ఇది చూసిన మిగతావారు ఉన్నతాధికారులకు విషయాన్ని తెలపడంతో.. ఆ హెడ్మాస్టర్ ని సస్పెండ్ చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని బహ్రెచ్  జిల్లాలోని శివపూర్ బైరాగి ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ స్కూల్లో హెడ్మాస్టర్ గా దుర్గాప్రసాద్ జైస్వాల్ అనే వ్యక్తి విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి  మద్యం తాగే అలవాటుంది. కొద్ది రోజుల క్రితం తప్పతాగి స్కూల్ కి వచ్చాడు.

భర్త అప్పు తీర్చడం లేదని భార్యపై వ్యాపారి అత్యాచారం.. అతడి సమక్షంలోనే దారుణం.. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్

ఆ సమయంలో స్కూల్లో తరగతి గదుల్లో టీచర్లు పాఠాలు చెబుతున్నారు. ఓ తరగతి గదిలోకి వెళ్లిన ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల ముందే దుస్తులన్నీ విప్పేశాడు. అక్కడే నగ్నంగా నిద్రపోయాడు. ఇది విద్యార్థులు తల్లిదండ్రులకు తెలపడంతో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు… దీన్నంతా వీడియో తీశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

ఈ విషయం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. వెంటనే వారు ప్రధానోపాధ్యాయుడుపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేశారు.  హెడ్మాస్టర్ ప్రవర్తన మీద విద్యార్థులు తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. అతను ఇలా చేయడం మొదటిసారి కాదని తరచుగా ఇలాగే చేస్తున్నాడని ఆరోపించారు. ప్రధానోపాధ్యాయుడి ఈ చేష్టలతో విసిగిపోయిన కొంతమంది అమ్మాయిలు స్కూలుకు వెళ్లడం మానేశారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో, ఈ తాగుబోతు ఉపాధ్యాయుడిపై బేసిక్ శిక్షాధికారి (బీఎస్ఏ)  విచారణకు ఆదేశించారు. బ్లాక్ విద్యాధికారి ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘దుర్గాప్రసాద్ మీద మాకు ఫిర్యాదు అందింది. విశ్వేశ్వర్గంజ్ బ్లాక్ లోని శివపూర్ బైరాగి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడైన దుర్గాప్రసాద్ మద్యం మత్తులో పాఠశాలకు వెళ్లినట్లు మాకు తెలిసింది. 

అతని ఈ అనుచిత ప్రవర్తనకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోను ఇంకా మేము ధృవీకరించాల్సి ఉంది. ప్రాథమిక విచారణ తర్వాత అతడి మీద చర్యలు తీసుకున్నాం.  అవసరమైతే దీన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకువెళతాం’ అని బిఎస్ఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.