ఆదివారం రాత్రి చంద్రశేఖర్ ఇంటికి వెళ్తున్నాడు. యలహంక న్యూ టౌన్ హౌసింగ్ బోర్డు సమీపంలోకి రాగానే అతనికి నేచర్ కాల్ వచ్చింది. దీంతో బైక్ రోడ్డుపక్కన ఆపి Urination చేశాడు. ఈ సమయంలో వీధి కుక్కలకు ఆహారం పెట్టేందుకు ఓ మహిళ బయటికి వచ్చింది. 

బెంగళూరులో ఓ police మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె చూసేలా తన ప్రైవేట్ పార్ట్స్ ను ప్రదర్శిస్తూ అసహ్యంగా ప్రవర్తించారు. ఈ కారణంగా ఆ పోలీస్ సస్పెండ్ అయినట్లు ఓ పోలీసు అధికారి మంగళవారం తెలిపారు. బెంగళూరు ఈశాన్య డివిజన్ డీసీపీ, సి.కె. బాబా.. అమృతహళ్లి పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి చంద్రశేఖర్ ఇంటికి వెళ్తున్నాడు. యలహంక న్యూ టౌన్ హౌసింగ్ బోర్డు సమీపంలోకి రాగానే అతనికి నేచర్ కాల్ వచ్చింది. దీంతో బైక్ రోడ్డుపక్కన ఆపి Urination చేశాడు. ఈ సమయంలో వీధి కుక్కలకు ఆహారం పెట్టేందుకు ఓ మహిళ బయటికి వచ్చింది. 

ఆమెను చూసిన కానిస్టేబుల్ తన Private Parts ను ఆమెకు ప్రదర్శిస్తూ.. అసభ్యంగా బిహేవ్ చేశాడు. అతని ప్రవర్తనతో ముందుగా షాక్ అయిన మహిళ.. వెంటనే అలా దానిమీద అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆ మహిళతో కానిస్టేబుల్ వాగ్వాదానికి దిగాడు. 

తాడేపల్లిలో నకిలీ పోలీసుల హల్ చల్.. మహిళతో అసభ్య ప్రవర్తన...

ఈ ఘటనను స్థానికులు వీడియో తీశారు. ఈ వీడియోను బెంగళూరు పోలీస్ కమీషనర్ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్లు 354(A), 509ల కింద యలహంక న్యూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసుపై కేసు నమోదు అయ్యింది. ఈ ఘటన మీద తదుపరి విచారణ జరుగుతోంది. 

ఇదిలా ఉండగా, ఓ వ్యక్తి.. పట్టపగలు.. నడిరోడ్డుపై మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. రోడ్డు మీద వెళ్తున్న యువతిని అసభ్యంగా తాకాడు. ఈ ఘటన ఆగస్ట్ లో అస్సాంలో జరిగింది. తనపై అలా ప్రవర్తించిన వ్యక్తిని వదిలేయకుండా.. స్కూటీతో వెంబడించి మరీ ఆ కామాంధుడిని యువతి పట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోను.. తనకు ఎదురైన సంఘటనను యువతి.. సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. దీంతో.. ఈ ఘటనపై పోలీసులు సైతం స్పందించారు. 

నడి రోడ్డుపై దుస్తులు విప్పి.. మహిళతో అసభ్య ప్రవర్తన

ఈ సంఘటన అస్సాంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాంలోని రుక్మిణీ నగర్ కి చెందిన యువతి భావనా కష్యప్ స్కూటీ మీద వెళుతుండగా.. ఓ వ్యక్తి ఆమెను ఆపాడు. అడ్రస్ అడుగుతున్నట్లు నటించి.. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను అసభ్యంగా తాకాడు. అనంతరం పారిపోయేందుకు యత్నించాడు. అతనిని స్కూటీతో వెంబడించి పట్టుకుంది. 

దానినంతటినీ వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేసి.. తన ఆగ్రహాన్ని తెలియజేసింది. వీడియో పోలీసులకు కంట పడటంతో.. నిందితుడిని తాజాగా అరెస్టు చేశాడు. ఈ విషయాన్ని గువాహటి పోలీసులు తమ ట్విట్టర్ లో షేర్ చేశారు.