తాడేపల్లి, నులకపేటలో  స్పెషల్ బ్రాంచ్ పోలీసులమంటూ ఇద్దరు వ్యక్తుల హల్ చల్ చేశారు. గుట్కాల తనిఖీల పేరుతో ఓ షాప్ లోకి ప్రవేశించి సోదాలు నిర్వహించారు. షాప్ లో ఉన్న మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించారు. 

తనిఖీ చేసిన షాప్ లోనే మద్యం సేవించి మహిళను బెదిరింపులకు గురిచేశారు. ఉన్నతాధికారులకు మామూళ్లు ఇవ్వాలంటూ దీనికోసం తమకు నగదు ఇవ్వమంటూ నకిలీ పోలీసులు డిమాండ్ చేశారు. 

దీంతో భయపడిపోయిన మహిళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. మహిళ ఇచ్చిన సమాచారంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోవడంతో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. 

వీరు ఈ మహిళ దగ్గరే కాకుండా పట్టణంలోని పలు దుకాణాల్లో పొలీసులమంటూ నగదు వసూలు చేసినట్లు సమాచారం అందింది. దీంతో ఈ ఘటనపై షాప్ యజమాని పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేశారు. షాప్ యజమాని  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.