బెహిష్తీ జెవార్ భారత ముస్లింల ఇళ్లల్లో నేటికీ ఎక్కువగానే కనిపిస్తుంది. ఖురాన్, హడిత్ తర్వాత ఎక్కువ అమ్ముడుపోయిన పుస్తకం ఇదే. కానీ, ఈ పుస్తకంలో కాలం చెల్లిన ఆలోచనలు, కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. నేటి ఆధునిక కాలంలో ఈ పుస్తక విలువ కొన్ని అంశాలను మినహాయిస్తే.. ప్రశ్నార్థకమే.
న్యూఢిల్లీ: గత శతాబ్ద కాలంలో భారత ముస్లింలలో ఖురాన్, హడిత్‌ల తర్వాత అత్యధిక ఆదరణ పొందిన పుస్తకం ఏదైనా ఉంటే అది బెహిష్తీ జెవార్. ఇప్పటికీ ఈ పుస్తకం ముస్లిం ఇళ్లల్లో కప్‌బోర్డుల్లో, షెల్ఫ్‌లలో కనిపిస్తాయి. ఆడబిడ్డలకు కట్నంతోపాటు ఈ పుస్తకాన్ని కూడా పెట్టేవారు. తమ బిడ్డలకు పెద్దమొత్తంలో సొమ్ము ఇచ్చుకోని పెద్దలు గతంలో ఈ పుస్తకాన్ని తప్పకుండా ఇచ్చేవారు. అందుకే ఇక్కడ ఖురాన్ తర్వాత అత్యధికంగా అమ్ముడపోయిన పుస్తకాల్లో బెహిష్తీ జెవార్ ఉంటుంది. ఈ పుస్తకాన్ని ఇండియన్ స్కాలర్ అష్రఫ్ అలీ తన్వీ రాశారు. ఇందులో పురుషులు, మహిళల సమస్యలు, ఇద్దరికీ సంబంధించిన విషయాలను రాశారు.
గత 50 ఏళ్లలో ఈ బుక్ పై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఇందులోని కొన్ని భాగాలు వివాదాస్పదంగా ఉన్నాయని భారత ముస్లింలు విమర్శించారు. ఇది దియోబంది సెక్ట్ ముస్లిం సముదాయాని కోసం రాసిందని, కానీ, అనూహ్యంగా అన్ని వర్గాల ముస్లింల ఆదరణ పొందిందనేది సాధారణ విమర్శ.
ఆర్థిక, సామాజిక, జాతీయ, మత, సాంస్కృతిక, వ్యక్తిగత, థెరపేటిక్, మెడికల్, లైంగిక, భాషాపరమైన సమస్యలను చర్చించిన పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని బలంగా ఢీకొట్టిన, లేదా విమర్శించిన పుస్తకం ఇండియాలో రాలేదు. వచ్చినా ప్రాచుర్యం పొందలేదు.
ఒక స్కాలర్ వైద్యుడిగా, రచయితగా, సైకాలజిస్టుగా, చర్మ వ్యాధి నిపుణుడిగా, మైథాలజిస్టుగా, సెక్సాలజిస్టుగా, జ్యూరిస్ట్‌గా పని చేసినప్పుడు ఆయన రచనలో లోపాలుండే ఆస్కారం ఎక్కువ. ఇక్కడా అదే జరిగింది. ఆయన కాలానికి సంబంధించిన పరిస్థితులను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఆ కాలంలో భారత ఇంకా తక్కువే అభివృద్ధి చెందింది. ముస్లిం మహిళలకు విద్యా చాలా స్వల్పం.
Also Read: బౌద్ధ విలువలను భారత్ ఎత్తిపడుతుంది.. ప్రపంచమంతటా ప్రచారం చేస్తుంది: రష్యాలో భారత దూత పవన్ కపూర్
నేటి పరిస్థితుల్లో చూస్తే.. ఈ పుస్తకంలో చాలా తప్పిదాలు ఉన్నాయి. ఉదాహరణఖు మౌలానా ఈ పుస్తకంలో ఇచ్చిన కొన్ని స్టేట్‌మెంట్లు చాలా పొరపాటుగా కనిపిస్తాయి. జకాత్ కోసం గోవుకు, బర్రెకు, ఒంటెకు, మేకకు ఒక వయసు నిర్ణయించడం తప్పు. మహిళలు గుండు చేయించుకోవడం, వెంట్రుకలు చిన్నగా కత్తిరించుకోవడం నిషేధం అని ఈ పుస్తకం చెప్పడం. ఎందుకంటే, హడిత్ ఇలాంటి వాటివి శాపాలకు దోహదం చేస్తాయని చెప్పినా ఈ పుస్తకం పేర్కొంది.
గోర్లు కొరకడం ద్వారా ల్యూకోడెర్మా వస్తుందనేది అర్థరహితం. ఆల్కహాల్ కంటెంట్ ఉంటుందని అల్లోపతిక్ మెడిసిన్ నిషేధించడ సరికాదు. సంగీతం వినడం, అపరిచితులతో ఒంటరిగా ఉండటం పాపంగా, అతిక్రమణగా చెప్పడం, వర్షం కోసం కలిసి ప్రార్థించాలని చెప్పడం కాలం చెల్లిన నమ్మకాలు. గట్టిగా నవ్వడం కూడా స్నానం చేసినా చేయనట్టుగా మారుస్తుందని నమ్మడం అక్కర్లేదు.
మహిళలు స్నానం చేయగా మిగలిన నీటిని పురుషులు స్నానం చేయడం సరికాదని చెప్పడం అసమంజసం. మల, మూత్ర విసర్జన చేస్తూ లేదా నగ్నంగా ఉన్నప్పుడు సూర్యుడిని లేదా చంద్రుడిని చూడటం సరికాదని చెప్పడం మూఢనమ్మకాన్ని తేవడమే. అందుకే, ఈ పుస్తకం రాస్తుండగా రచయిత తన నమ్మకాలను కూడా పొందుపరిచినట్టు అర్థం అవుతుంది. రుతుచక్రం, పవిత్రత, క్రీడల్లో మహిళలు పాల్గొనడంలో ఈ పుస్తకం చేసే సూచనలు మహిళలు విద్యావంతులైన నేటి సమాజంలో ప్రాసంగికం కాదు.
ఈ పుస్తకం రాసిన కాలంలో దీనికి కొంత ప్రాసంగికత ఉన్నదేమో.. అది కూడా చాలా పరిమితులు, వివాదాస్పద ఆలోచనలతో నిండి ఉన్నది. బేసిక్ రిలీజియస్ ఇష్యూస్ తప్పితే ఆధునిక కాలంలో ఈ పుస్తక విలువ ప్రశ్నార్థకమే.
