జార్ఖండ్ లో హెచ్3ఎన్2 కేసులు రెండుకు చేరుకున్నాయి. శనివారం సాయంత్రం నాలుగేళ్ల బాలికకు, 68 మహిళకు ఈ వైరస్ పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. 

హెచ్3ఎన్2 ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఈ వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పలు ఈ రాష్ట్రాలో ఈ వైరస్ వల్ల మరణాలు కూడా సంభవించాయి. తాజాగా రాంచీకి చెందిన నాలుగేళ్ల బాలికకు కూడా ఈ వైరస్ పాజిటివ్ గా తేలింది. దీంతో జార్ఖండ్ లో హెచ్3ఎన్2 కేసుల సంఖ్య శనివారం సాయంత్రం రెండుకు చేరుకున్నాయి. 

భారత్ కు చేరుకున్న జపాన్ ప్రధాని కిషిడా.. ఢిల్లీ ఎయిర్ పోర్టులో స్వాగతం పలికిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

దగ్గు, జలుబు, జ్వరం, న్యుమోనియా లక్షణాలతో మూడు రోజుల క్రితం బాలిక ఆసుపత్రిలో చేరిందని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చెందిన డాక్టర్ రాజేష్ కుమార్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో తెలిపారు. ఆమె నమూనాలను పరీక్షల కోసం ప్రైవేటు డయాగ్నోస్టిక్స్ ల్యాబ్ కు పంపించగా శనివారం సాయంత్రం పాజిటివ్ అని తేలింది. బాలికను ఐసోలేషన్ లో ఉంచి ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. బాలిక ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్నప్పటికీ నిలకడగా ఉంది. అయితే చిన్నారికి యాంటీ వైరల్ డ్రగ్ ఇస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. బాలికకు ఇటీవల ట్రావెల్ హిస్టరీ ఉందో లేదో హాస్పిటల్ అధికారులు నిర్ధారించలేకపోతున్నారు. 

లొంగిపోయిన అమృత్ పాల్ సింగ్ మామ, డ్రైవర్.. ఖలిస్థాన్ అనుకూల నాయకుడి కోసం కొనసాగుతున్న పోలీసుల వేట

కాగా.. జలుబు, దగ్గు, జ్వరంతో టాటా మెయిన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జంషెడ్ పూర్ కు చెందిన 68 ఏళ్ల మహిళకు కూడా శనివారం హెచ్3ఎన్2 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మరో వైపు.. రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) తన మైక్రోబయాలజీ విభాగంలో హెచ్3ఎన్2, స్వైన్ ఫ్లూ కేసులను గుర్తించడానికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను ముమ్మరం చేసింది. ‘‘గత కొంత కాలంగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరుగుతున్నాయి. కిట్ల కొరత కారణంగా అది మందగించింది. శనివారం మా నిల్వలు నిండిపోయాయి’’ అని రిమ్స్ మైక్రో బయాలజీ విభాగాధిపతి డాక్టర్ మనోజ్ కుమార్ ఆదివారం ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు తెలిపారు. రిమ్స్ లో పరీక్షించిన నమూనాల్లో హెచ్ 3ఎన్ 2 పాజిటివ్ గా నిర్ధారణ కాలేదని ఆయన చెప్పారు. 

ఢిల్లీలో షాకింగ్.. యువతిని తిడుతూ, బలవంతంగా క్యాబ్ లోకి లాక్కెళ్లి.. వీడియో వైరల్....

కాగా.. జార్ఖండ్ లో కోవిడ్ కేసులు కూడా నెమ్మదిగా పెరుగుతున్నాయి. శనివారం సాయంత్రం ఐదు కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో కోవిడ్ -19 గ్రాఫ్ ను ఆరోగ్య అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. దేవ్ ఘర్ లో ఒక కేసు, రాంచీ జిల్లాలో రెండు, పశ్చిమ సింగ్ భూమ్ లో రెండు కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ లో పేర్కొంది. శనివారం సాయంత్రానికి రాష్ట్రంలో 10 యాక్టివ్ కోవిడ్ -19 కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది.