ఢిల్లీలో ఓ యువతి మీద ఇద్దరు యువకుల దాష్టీకం వెలుగు చూసింది. యువతిని బలవంతంగా కారులోకి ఎక్కిస్కున్న వీడియో వైరల్ గా మారింది. 

ఢిల్లీ : మహిళల మీద జరుగుతున్న దాడుల విషయంలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశ రాజధాని ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడు ఓ యువతిని బలవంతంగా క్యాబ్లోకి ఎక్కించాడు. ఆమె చొక్కా పట్టుకుని లాగుతూ.. దుర్భాషలాడుతూ లాక్కెళ్ళి కారులో విసిరేశాడు. ఆ యువతి కారులో నుంచి పారిపోకుండా కారుకు మరోవైపు ఇంకో యువకుడు కూడా నిలబడి ఉన్నాడు.. ఢిల్లీలోని మంగోల్ పూరిలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చూసిన నెటిజన్లు దేశ రాజధాని ఢిల్లీలో అమ్మాయిల భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వీడియో వెలుగులోకి రావడంతో ఢిల్లీ పోలీసులు దీన్ని సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. సదరు యువతిని వేధించిన నిందితుల కోసం గాలిస్తున్నారు. పోలీసుల విచారణలో దీనికి సంబంధించిన కొన్ని వివరాలు తెలిసాయి. ఆ యువతి మరో ఇద్దరు యువకులు.. రోహిణి నుంచి వికాస్పూర్ వెళ్లేందుకు ఈ క్యాబ్ ను బుక్ చేసుకున్నట్లుగా తెలిసింది. మార్గమధ్యంలో వీరి మధ్య గొడవ జరిగింది. దీంతో యువతి తాను వారితో రానని చెప్పి క్యాబ్ దిగింది… దీంతో వారు ఆమెని బలవంతంగా తీసుకువెళ్లారని తెలిపారు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకున్నమని దర్యాప్తు చేపట్టామని తెలిపారు. నిందితులను గుర్తించి త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని అన్నారు. 

లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయంపై ఖలిస్థాన్ అనుకూలవాదుల దాడి.. మండిపడ్డ భారత్...

ఇదిలా ఉండగా, ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఢిల్లీ, గీతా కాలనీ ప్రాంతంలో బాగా కుళ్లిపోయిన స్థితిలో ఓ విదేశీయురాలి మృతదేహాన్ని శుక్రవారం ఢిల్లీ పోలీసులు గుర్తించారు. గీతానగర్ ప్రాంతంలోని అండర్‌పాస్ సమీపంలో మృతదేహం లభ్యమైందని ఏఎన్ఐ తెలిపింది. ఈ ఘటనపై డీసీపీ షహదారా రోహిత్ మీనా మాట్లాడుతూ, మృతురాలి వయస్సు 60 ఏళ్లు పైబడి ఉంటుందని అన్నారు. సంఘటనా స్థలం నుంచి పాస్‌పోర్టు, ఇతర పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది. 

ఇలాంటి మరో సంఘటనలో, నోయిడా పోలీసులు గురువారం నాడు నగరంలోని ఒక కాలువలో ఒక వ్యక్తి కాళ్ళు, చేతులు దొరికాయి. దీంతో స్థానికంగా కలకలం రేగింది. దీనిమీద దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.సెక్టార్ 8లోని ఇండస్ట్రియల్ ఏరియాలో రెండు నుంచి మూడు అడుగుల వెడల్పు ఉన్న డ్రైన్‌లో ఈ అవయవాలు ఉదయం 10 గంటలకు కనిపించాయని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నోయిడా) హరీష్ చందర్ పిటిఐకి తెలిపారు.

“ఈ విషయం ఫేజ్ 1 పోలీస్ స్టేషన్‌ లో రిపోర్ట్ చేయబడింది. ఆ తర్వాత ఫోరెన్సిక్ బృందంతో పాటు పోలీసు అధికారులు తదుపరి దర్యాప్తు కోసం స్థలాన్ని సందర్శించారు. ఆ అవయవాలు నాలుగైదు రోజుల క్రితం చనిపోయిన వ్యక్తివిగా గుర్తించారు. ఆ శరీర భాగాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు’’ అని చందర్ తెలిపారు.

"శరీర భాగాలను పోస్ట్‌మార్టం కోసం పంపారు. ఆ రిపోర్టు ఆధారంగా ఈ కేసులో చర్యలు తీసుకుంటాం" అని అధికారి తెలిపారు. బాధితురాలిని గుర్తించడం వంటి మరిన్ని వివరాలను పోలీసులు ఇంకా రూపొందించాల్సి ఉందని, దాని కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.