ముఖం నిండా గడ్డం, పురుషుడిలా గొంతు: విడాకులు కోరిన భర్త, షాకిచ్చిన కోర్టు

Gujarat Man Seeks Divorce Saying Wife Has Beard, Court Rejects Petition
Highlights

అచ్చు పురుషుడిలానే 


అహ్మదాబాద్: తన భార్య గొంతు మగవారిలా ఉందని, ఆమెకు పురుషుల మాదిరిగా  గడ్డం కూడ ఉందని  ఓ వ్యక్తి  అహ్మదాబాద్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  అయితే అహ్మదాబాద్ ఫ్యామిలీ కోర్టు ఈ పిటిషన్ ను కొట్టేసింది.

అహ్మదాబాద్ కు చెందిన ఓ వ్యక్తి పెళ్ళికి ముందు తాను తన భార్య  ముఖాన్ని చూడలేదన్నారు.కనీసం ఆమె ముఖం కూడ చూడకుండానే  ఆమెను వివాహం చేసుకొన్నట్టుగా ఆమె చెప్పారు.  పెళ్ళి చూపుల్లో తనకు ఆమెను చూపిన సమయంలో  ఆమెకు పరదా ధరించిందని ఆయన కోర్టుకు తెలిపారు. అయితే పరదా తీయడం సంప్రదాయం కాదని  కుటుంబసభ్యులు చెప్పారని ఆయన గుర్తు చేశారు.

వివాహమైన తర్వాత ఆమె ముఖం చూసి తాను ఆశ్చర్యపోయినట్టుగా ఆయన చెప్పారు. ఆమెకు మగవారిలో గడ్డం ఉందన్నారు. ఆమె గొంతు కూడ మగవారిలానే ఉందన్నారు. ఈ విషయాలను అమ్మాయి కుటుంబసభ్యులు తనకు చెప్పకుండా పెళ్ళి చేసి మోసం చేశారని కోర్టుకు సమర్పించిన పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు.

అయితే హర్మోన్ల అసమతుల్యత కారణంగానే  ముఖం మీద గడ్డం వచ్చిందని భార్య తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు.  కానీ, ఈ గడ్డాన్ని తొలగించుకోవచ్చని ఆమె తరపు న్యాయవాది ప్రకటించారు. 

అయితే తన భర్త తన నుండి విడాకులు కావాలని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆమె కోర్టుకు చెప్పారు.  ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు విడాకుల పిటిషన్ ను కొట్టేసింది.

loader