MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Viral News: అమ్మ దొంగ.. నగల దుకాణం నుంచి బంగారాన్ని ఎత్తుకెళ్లిన పావురం. చివరికి ఏమైందంటే

Viral News: అమ్మ దొంగ.. నగల దుకాణం నుంచి బంగారాన్ని ఎత్తుకెళ్లిన పావురం. చివరికి ఏమైందంటే

Viral News: బంగారం ధర ఊహించని స్థాయిలో పెరిగింది. దీంతో బంగారాన్ని అత్యంత జాగ్రత్తగా కాపాడుకునే పరిస్థితి వచ్చింది. దొంగలు సైతం బంగారాన్ని టార్గెట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ పావురం చేసిన పని నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Feb 08 2026, 02:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రాజస్థాన్‌లో ఊహించని ఘటన
Image Credit : Gemini AI

రాజస్థాన్‌లో ఊహించని ఘటన

రాజస్థాన్ రాష్ట్రం నాగౌర్ జిల్లాలోని డెగానా పట్టణంలో ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగింది. ఓ నగల దుకాణం నుంచి రూ.1 లక్ష విలువైన బంగారు గొలుసును ఓ పావురం ఎత్తుకెళ్లడం అక్కడి వ్యాపారులను ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. చివరికి ఆ గొలుసు సురక్షితంగా లభించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
ఇంతకీ ఏం జరిగిందంటే.?
Image Credit : Gemini AI

ఇంతకీ ఏం జరిగిందంటే.?

స్థానిక వ్యాపారుల వివరాల ప్రకారం.. నగల దుకాణంలో కొందరు కార్మికులు పనిలో నిమగ్నమై ఉండగా, అకస్మాత్తుగా ఓ పావురం లోపలికి ఎగిరివచ్చింది. క్షణాల్లోనే కౌంటర్‌పై ఉన్న బంగారు గొలుసును నోటితో పట్టుకుని బయటకు ఎగిరిపోయింది. ఈ సంఘటన అక్కడున్న వారిని షాక్‌కు గురిచేసింది.

గొలుసుతో ఎగిరిపోయిన పావురాన్ని కొంతమంది వ్యాపారులు వెంటనే గమనించారు. అది మార్కెట్ పైకప్పుపై కూర్చుని కొంతసేపు అక్కడే ఉన్నట్లు తెలిపారు. ఆ సమయంలో పావురం తల ఊపడంతో బంగారు గొలుసు దాని మెడకు చుట్టుకున్నట్లు ఓ దుకాణదారు చెప్పారు.

Related Articles

Related image1
రేష‌న్ కార్డు ఉన్న వారి ఖాతాలోకి నేరుగా డ‌బ్బులు.. కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.
Related image2
క‌ళ్లు చెదిరే బంగారం నిల్వ‌లు.. వెలికి తీస్తే భూమ్మీదున్న అంద‌రికీ రూ. 4 కోట్లు పంచొచ్చు. ఎక్క‌డంటే.?
34
చివరికి ఏమైందంటే.?
Image Credit : Gemini AI

చివరికి ఏమైందంటే.?

ఈ ఘటన విషయం చుట్టుపక్కల వ్యాపారులకు తెలియడంతో పెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరారు. కొందరు పావురాన్ని పట్టుకునేందుకు పైకప్పుపైకి కూడా వెళ్లారు. అయితే పావురం అక్కడి నుంచి ఎగిరిపోయింది. ఈ క్రమంలో బంగారు గొలుసు పైకప్పుపైనే పడిపోయింది. వెంటనే వ్యాపారులు దాన్ని సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. గొలుసు తిరిగి లభించడంతో య‌జ‌మాని ఊపిరి పీల్చుకున్నాడు.

44
బంగారం ధరలతో భద్రతపై ఆందోళన
Image Credit : Gemini AI

బంగారం ధరలతో భద్రతపై ఆందోళన

మార్కెట్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఇప్పటికే బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భద్రత పెద్ద సమస్యగా మారిందని తెలిపారు. దొంగతనాలు, దోపిడీల భయం ఎప్పుడూ ఉంటుందనీ, కానీ పావురం బంగారం ఎత్తుకెళ్లడం ఇదే మొదటిసారి అని అన్నారు. ఈ ఘటనతో కొందరు వ్యాపారులు సరదాగా.. ఇకపై దుకాణాల పైకప్పులు, కిటికీలకు గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయాల్సి రావొచ్చని వ్యాఖ్యానించారు. ఇక ఈ విష‌యం కాస్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇది చూసిన నెటిజ‌న్లు దొంగ పావురం అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్
Recommended image2
Now Playing
ప్రధాని మోదీకి కమల్ హాసన్ కీలక విజ్ఞప్తి | Kamal Haasan Pressmeet | Asianet News Telugu
Recommended image3
Indian Army : సైన్యం కోసం ఇండియా ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
రేష‌న్ కార్డు ఉన్న వారి ఖాతాలోకి నేరుగా డ‌బ్బులు.. కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.
Recommended image2
క‌ళ్లు చెదిరే బంగారం నిల్వ‌లు.. వెలికి తీస్తే భూమ్మీదున్న అంద‌రికీ రూ. 4 కోట్లు పంచొచ్చు. ఎక్క‌డంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved