గుజరాత్‌లో ఓ వ్యక్తి క్రికెట్ ఆడుతూ గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. హార్ట్ ఎటాక్‌తో నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయాడు. రాజ్‌కోట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 

అహ్మదాబాద్: గుజరాత్‌లో ఓ హఠాన్మరణం చోటుచేసుకుంది. 45 ఏళ్ల వ్యక్తి క్రికెట్ ఆడుతూనే కుప్పకూలిపోయాడు. నిమిషాల వ్యవధిలోనే హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాజ్‌కోట్‌లోని శాస్త్రి మైదాన్‌లో ఆదివారం చోటుచేసుకుంది. గడిచిన నెలన్నర వ్యవధిలో గుజరాత్‌లో ఇలాంటి ఘటన ఇది ఎనిమిదవది.

45 ఏళ్ల మయూర్ తన మిత్రులతో కలిసి శాస్త్రి మైదాన్‌లో క్రికెట్ ఆడుతున్నాడు. ఆయన క్రికెట్ ఆడుతుండగానే గ్రౌండ్‌లో కూలిపోయాడు. క్రికెట్ ఆడుతుండగా కొంత నర్వస్‌కు గురయ్యాడని చెప్పారు. ఆ తర్వాత స్టేడియంలోనే కుప్పకూలిపోయాడు. అతని మిత్రులు మయూర్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లేలోపే మయూర్ మరణించాడు. హాస్పిటల్ తీసుకెళ్లగా.. మయూర్ అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.

Also Read: కేంద్ర న్యాయ శాఖ మంత్రి క్షమాపణలు చెప్పాలి: ఆప్ నేత సౌరభ్ డిమాండ్.. ‘రిటైర్డ్ జడ్జీలపై కామెంట్ చేసి గీతదాటారు’

మయూర్ స్వర్ణకారుడని తెలిసింది. ఆయనే కుటుంబానికి ఏకైక పోషకుడు. మయూర్‌కు ఎలాంటి వ్యవసనాలు లేవని బంధువులు తెలిపారు. లిక్కర్ లేదా ఇతర వ్యసనాలేవీ లేవని చెప్పడం గమనార్హం.