Gujarat స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ప్రధాన నగరాల్లో night curfew

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గుజరాత్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది.  క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో నైట్‌ కర్ఫ్యూ ( night curfew) విధించింది. అలాగే.. రెస్టారెంట్లు, సినిమా హ‌ళ్ల‌పై ఆంక్షాలు విధించింది.  
 

Gujarat Govt extended night curfew (1 am to 5 am) in 8 major cities till December 31

ప్రపంచ దేశాల‌ను క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భ‌య‌పెడుతోంది. సౌత్రాఫికాలో వెలుగులోకి వ‌చ్చిన ఈ వేరియంట్ శ‌ర‌వేగంగా  వ్యాప్తి చెందుతూ.. ప్ర‌పంచ వ్యాప్తంగా పంజా విసురుతోంది. ప్రస్తుతం కేసుల సంఖ్య పరిమితంగా ఉన్నా.. పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. ఈ వేరియంట్ 
డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తోందని WHO హెచ్చ‌రించింది. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. ఒమిక్రాన్ విజృంభ‌న‌ను అడ్డుకోవడానికి ప్ర‌పంచ దేశాలు సిద్దమ‌య్యాయి. 

ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం కూడా చర్యలు ప్రారంభించింది. ఈ వైరస్‌ను తేలిగ్గా తీసుకోవద్దని, అనవసర ప్రయాణాలు, పార్టీలు, ఫంక్షన్లు వాయిదా వేసుకోవాలని కేంద్రం సూచించింది.  ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గుజ‌రాత్ స‌ర్కార్ అప్ర‌మ‌త్త‌మైంది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈ వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉంటుంద‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రించ‌డంతో ప‌లు ఆంక్షలు విధించింది. ఈ క్ర‌మంలో ప్రభుత్వం ఎనిమిది ప్రధాన నగరాల్లో నైట్‌ కర్ఫ్యూ విధించింది. 

Read also: వైసీపీ నేత సుబ్బారావుపై సుభాని వర్గీయుల దాడి: వద్దని చెప్పానన్న మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి

నేడు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై గుజ‌రాత్ ప్రభుత్వం సమీక్షించింది. ప్ర‌ధాన న‌గ‌రాల్లో నైట్ క‌ర్ఫ్యూ విధించాల‌ని భావించింది. ఈ సందర్భంగా అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, రాజ్‌కోట్, వడోదర, భావ్‌నగర్, జామ్‌నగర్, జునాఘర్ నగరాల్లో నైట్‌ కర్ఫ్యూను డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు పొడిగించిన‌ట్టు  ఆ రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

Read also: Philippines: 208 మందిని బ‌లిగొన్న రాయ్ తుఫాను.. నిరాశ్ర‌యులైన ల‌క్ష‌ల మంది..

ఆయా నగరాల్లో రాత్రి ఒంటి గంట ఉదయం 5 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ అమలులో ఉండనున్నది. ఈ మేరకు గుజరాత్‌ హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఈ నగరాల్లో ప‌లు ఆంక్షాలు విధించింది. రెస్టారెంట్లు ల్లో 75 శాతం సిట్టింగ్ కెపాసిటీతో న‌డ‌పాల‌ని  సినిమా హాళ్లు 100% సామర్థ్యంతో న‌డ‌పడానికి అనుమతించింది. సోమవారం గుజరాత్‌లో ఓమిక్రాన్ వేరియంట్‌లో నాలుగు కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 11కి చేరింది. 

Read also: మీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి: బీజేపీపై జయా బచ్చన్ ఫైర్

మ‌రోవైపు .. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో 10 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 153 కు చేరింది. అధికారిక గణాంకాల ప్రకారం.. దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్​ కేసులు న‌మోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 54, ఢిల్లీలో 22, రాజస్థాన్‌లో 17, కర్ణాటకలో 14, తెలంగాణ 20, గుజరాత్‌ 11, కేరళ 11, ఆంధ్రప్రదేశ్‌, చండీగఢ్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో ఒక్కొక్కటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios